Home » Ramakrishna
ప్రముఖ నటుడు చంద్రమోహన్(82) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సినీ హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణ, మంచు విష్ణు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సీపీఐ నేత రామకృష్ణ సంతాపం ప్రకటించారు.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో సీపీఐ, టీడీపీ నేతల అక్రమ అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు.
ఖరీప్ సీజన్‌లో నీళ్లు లేక పంటలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) అన్నారు.
విజయవాడ: కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వలస కూలీల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
విజయవాడ: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆ లేఖలో కోరారు.
కర్నూలు జిల్లా (Kurnool District) ను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( CPI Ramakrishna ) అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసికట్టుగా వ్యూహం రచించి పకడ్బందీగా చంద్రబాబును అరెస్ట్ చేయించారని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రజల్లో వ్యతిరేకత గమనించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్‌కు అపాయింట్‌మెంట్ ఇప్పించారన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒంగోలు: ఏపీకి ముందస్తు ఎన్నికలొస్తే సీఎం జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయడానికి వ్యూహాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.
ప్రకాశం జిల్లా: కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని, చేతగాని దద్దమ్మ రాష్ట్రానికి సీఎంగా ఉండటం వలన ఏపీకి అన్యాయం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు.