Ramakrishna: ఏపీ సీఎంకు ఎవరూ లెక్కలేదు.. చివరకు కోర్టుకు కూడా..

ABN , First Publish Date - 2023-10-12T11:26:04+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Ramakrishna: ఏపీ సీఎంకు ఎవరూ లెక్కలేదు.. చివరకు కోర్టుకు కూడా..

అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరు లెక్కలేదని.. చివరకు కోర్టులు కూడా లెక్కలేదన్నారు. సుప్రీంకోర్టులో (Supreme Court)మూడు రాజధానుల కేసు పెండింగ్‌లో ఉండగానే విశాఖకు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వెనకబడిన ప్రాంతాలు ఈ రాష్ట్రంలో నాలుగు జిల్లాలు రాయలసీమలో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి ఇవాళ కోర్టు దిక్కరణ చేస్తున్నారన్నారు. రాయలసీమకు పక్కాగా ఇవాళ అన్యాయం జరుగుతోందని తెలిపారు. అనంతపురంకు తాగు, సాగు నీరు రాకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా జలాల మీద కేంద్ర ప్రభుత్వ విధానం రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కేంద్రం అడుగడునా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. ‘‘నీకెందుకు వై నాట్ 175 ... ఇప్పుడు ఇంత మంది ఉండి ఏం ఉద్దరించారు. ఇవాళ నిన్ను ప్రజలేవరు కోరుకోవడం లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను ఇంటికి సాగణంపితే తప్ప అభివృద్ధి జరగదని రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-10-12T11:26:04+05:30 IST