Home » Ramdas Athawale
ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కావాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయంగా ఉందని, అయితే ఏక్‌నాథ్ షిండే సంతోషంగా లేరని, ఆయన అసంతృప్తిని తొలగించాల్సి ఉంటుందని రామదాస్ అథవాలే అన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఎక్కడుంటే అక్కడ వాతావరణం అహ్లాదకరంగా మారిపోతుంటుంది. చమత్కారపు మాటలతో అందర్నీ హాయిగా నవ్విస్తుంటారు. ఈసారి ఆయన తన సహచర మంత్రి రాందాస్ అథవాలేను టీజ్ చేశారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరనున్నారా? అవుననే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఎన్డీయేలోకి నితీష్ రానున్నారంటూ కేంద్రం మంత్రి రామ్‌దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలను తాజాగా జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ బలపరిచారు.
విపక్షాల కూటమి ఇండియా ఏర్పాటుకు మొదట్నించీ విస్తృతంగా కసరత్తు చేస్తూ, ఇటీవల పాట్నాలో కూటమి సమావేశానికి ఆతిథ్యమిచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ ఏ క్షణంలోనైనా ఎన్డీయేలో చేరుతారని, నితీష్ తమ వాడని అన్నారు.