Home » Ramireddy Pratap Kumar Reddy
Andhrapradesh: జిల్లాలోని కావలి జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్ఎస్ఆర్ స్కూల్ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే స్కూల్ బస్సులో పది మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. మరో అయిదుగురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి.
కావలి(Kavali)లో అక్రమ లేఅవుట్లపై అధికారులు ఉక్కపాదం మోపుతున్నారు. వైసీపీ(YSRCP) హయాంలో జిల్లావ్యాప్తంగా అక్రమ లేఅవుట్లు(Illegal Layout) భారీగా వెలిశాయి. ఖాళీగా కనిపించిన ప్రైవేటు, ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు, వారి అనుచరులు వదిలిపెట్టలేదు.
ఈసారి ఏపీ ఎన్నికల్లో పోలింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఇది ఎవరికి ప్లస్ అవుతుందో.. మైనస్ అవుతుందో పక్కనబెడితే పోలింగ్లో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటేంటంటే.. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీకి ఓటేశారని తెలుస్తోంది. అయితే ఇది కావాలని చేయలేదట.. పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ హడావిడిగా సైకిల్కి ఓటేశారట.
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటే.. ఆ పార్టీల నేతల మధ్య విభేదాలు స్థానికంగా ఇబ్బందికరంగా మారుతున్నాయి. కావలిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు
Andhrapradesh: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వాలంటీర్లలోనూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. కావలిలో టీడీపీ అభ్యర్ధి కావ్యా కృష్ణారెడ్డికి నలుగురు వాలంటీర్లు మద్దతు తెలిపారు. అయితే విషయం తెలిసిన అధికారులు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు.