AP News: స్కూల్ బస్సును ఢీకొన్న లారీ... మాజీ ఎమ్మెల్యేపై ప్రజల ఆగ్రహం
ABN , Publish Date - Jul 02 , 2024 | 10:43 AM
Andhrapradesh: జిల్లాలోని కావలి జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్ఎస్ఆర్ స్కూల్ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే స్కూల్ బస్సులో పది మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. మరో అయిదుగురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి.
నెల్లూరు, జూలై 2: జిల్లాలోని కావలి (Kavali) జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. ఆర్ఎస్ఆర్ స్కూల్ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే స్కూల్ బస్సులో పది మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. మరో అయిదుగురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన విద్యార్థులను కావలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Good News: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..
ఆ డివైడర్‌ను తొగలించడం వల్లే...
కాగా... మాజీ సీఎం జగన్ (Former CM Jaganmohan Reddy) పర్యటన సమయంలో ఆ ప్రాంతంలో డివైడర్‌ను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (Former MLA Ramireddy Pratapkumar Reddy) తొలగింపజేశారు. ఈ క్రమంలో డివైడర్ తొలగించడం వల్లే తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి రామిరెడ్డికి చెందిన స్కూల్ బస్సుకే ప్రమాదం జరిగింది. దీంతో రామిరెడ్డి తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి....
Chandrababu: ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం!
AP Pensions: పెన్షన్ల పంపిణీలో చేతివాటం.. రూ. 200 కోత
Read Latest AP News AND Telugu News