Kavali: వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అనుచరుడి అక్రమ లేఅవుట్ తొలగింపు..
ABN , Publish Date - Jun 16 , 2024 | 09:26 AM
కావలి(Kavali)లో అక్రమ లేఅవుట్లపై అధికారులు ఉక్కపాదం మోపుతున్నారు. వైసీపీ(YSRCP) హయాంలో జిల్లావ్యాప్తంగా అక్రమ లేఅవుట్లు(Illegal Layout) భారీగా వెలిశాయి. ఖాళీగా కనిపించిన ప్రైవేటు, ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు, వారి అనుచరులు వదిలిపెట్టలేదు.
నెల్లూరు: కావలి(Kavali)లో అక్రమ లేఅవుట్లపై అధికారులు ఉక్కపాదం మోపుతున్నారు. వైసీపీ(YSRCP) హయాంలో జిల్లావ్యాప్తంగా అక్రమ లేఅవుట్లు(Illegal Layout) భారీగా వెలిశాయి. ఖాళీగా కనిపించిన ప్రైవేటు, ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు, వారి అనుచరులు వదిలిపెట్టలేదు. కావలిలో కోట్ల విలువ చేసే భూములను అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి(Ramireddy Pratap Kumar Reddy) అనుచరులు కబ్జా చేశారు. ప్రైవేటు స్థలంలోపాటు ప్రభుత్వ భూముల్లోనూ వారు లేఅవుట్లు వేశారు. అప్పుడు వైసీసీ ప్రభుత్వం ఉండడం, ఆక్రమణదారులు ఆ పార్టీ ఎమ్మెల్యే అనుచరులు కావడంతో అధికారులు సైతం నోరు మెదపలేకపోయారు.
తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కావలిలో అక్రమ లేఅవుట్లపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ముఖ్య అనుచరుడు సుకుమార్ రెడ్డి వేసిన అక్రమ లేఅవుట్లపై విచారణ చేపట్టి వాటిని తొలగిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి రామిరెడ్డి అనుచరులు పత్తాలేకుండా పోయారు.
ఇవి కూడా చదవండి:
Elephant Attack: పీఎం తండాలో రైతును కాలితో తొక్కి చంపిన ఏనుగు..
Crime News: తాడిపత్రి పాతకోటలో భార్యపై అనుమానంతో గొంతు కోసిన భర్త..