Home » Raptadu
మండలకేంద్రంలో బుధవారం రాత్రి ఈ దురు గాలి, వడగండ్లవాన బీభత్సం సృష్టించాయి. వాటి ధాటికి పలు పంట లు దెబ్బతినడంతో రైతులకు తీవ్రంగా నష్టం కలిగింది. రేకుల దుకా ణాలు, షెడ్లు, విద్యుతస్తంభాలు పలు చెట్లు నేలకొరిగాయి. సీకేపల్లి జాతీయ రహ దారి పక్కన గ్రామానికి చెందిన ఆంజనేయులు, రాధాక్రిష్ణ ఏర్పాటు చేసు కున్న రేకుల దుకాణాలు తీవ్రమైన గాలుల ధాటికి రహదారి అవతల ఉన్న లేఔట్లలోకి ఎగిసిపడ్డాయి.
మండల కేంద్రంలోని ఆటోనగర్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. తరచూ రాత్రిళ్లు అక్కడి మెకానిక్ షాపుల్లోకి చొరబడి వాహనాల సామగ్రి ఎత్తుకెళ్లి, అమ్ముకుంటున్నారు. రిపేరీ కోసం వచ్చిన వాహనాల విలువైన సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్తుండటంతో మెకానిక్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడులో 44వ జాతీయ రహదారి పక్కన 554-2 సర్వే నెంబర్లో 33 ఎకరాల్లో ఆటో నగర్ ఉంది. ద్విచక్రవాహనం మినహా మిగతా అన్ని వాహ నాల రిపేరీకి మెకానిక్ షాపులు ఉన్నాయి.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వెనుకబడిన ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని జనచైతన్యకాలనీలో గురువారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హజరయ్యారు. తొలుత జనచైతన్య కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు.
గత వైసీపీ పాలనలో మండలంలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పరిటాలసునీత విమర్శించారు. వారి చి ట్టా తమవద్ద ఉందని, త్వరలో వారి ఆటకట్టిస్తామన్నారు. ఇది మంచి ప్రభు త్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బుధవారం మండలంలోని ప్యాధిండి, చందమూరు, ఎనఎస్‌గేటు, చెన్నేకొత్తపల్లి, హరియన చెరువు గ్రామాల్లో పర్య టించారు. రూ.3.60 కోట్లతో చేపడుతున్న సీసీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఆటో నగర్ మెకానిక్ షాపుల యజమానులు రాప్తాడు గ్రామ పంచాయతీకి పన్ను చెల్లించ డం లేదు. ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారు. పన్ను వసూలు చేయాల్సిన పంచాయ తీ అధికారులు పట్టించుకోలే దు. ఇదిగో చేస్తాం. అదిగో చే స్తాం అంటూ జాప్యం చేస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ భారీగా నష్టపోతోంది.
ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తూ ప్రభుత్వం 80శాతం సబ్సిడీతో విత్తనాన్ని అందిస్తోందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు.
బాలికల వసతి గృహంలో ఉండలేకున్నాం. వరండాల్లో ఫ్లోర్ బండలు కుంగిపోయాయి. నిత్యం అందులోంచి జెర్రిలు వస్తున్నాయి. బాతరూంకు తలుపులు లేవు. కొన్నివాటికి గొళ్లాలు లేవు. వసతి గృహానికి మూడువైపులా ప్రహరీ ఉన్నా, ఓ వైపు లేదు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని బాలికలు ఆందోళనలు చెంతుతున్నారు.
జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కూమార్ అన్నారు. మండలంలోని బి.యాలేరు సచివాలయంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండలం నరసంపల్లి, సోమరవాండ్లపల్లి గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పిం ఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
అహుడా పరిధిలో ఇళ్ల స్థలాల లే అవుట్లు, ఇతర విషయాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె అహుడా అధికారులతో సమావేశం నిర్వహించారు. రియల్టర్లు నిబంధనలను పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లేదంటే ప్రజలు నష్టపోతారని అన్నారు. రాప్తాడు పరిధిలో పెండింగ్ ఫైల్స్‌ని వెంటనే క్లియర్ ...