Share News

Paritala Sunitha Vs Jagan: చావు ఇంటికొచ్చి జేజేలా.. జగన్‌పై పరిటాల సునీత ఆగ్రహం

ABN , Publish Date - Apr 08 , 2025 | 03:13 PM

Paritala Sunitha Vs Jagan: జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను జగన్ చదువుతున్నారని విమర్శించారు. పరీక్షల్లో కాపీ కొట్టినట్టుగా పేపర్లు చూసి చదువుతున్నారని వ్యాఖ్యలు చేశారు. పాపిరెడ్డిపల్లిలో అనుకోకుండా ఒక సంఘటన జరిగిందని.. కానీ దాన్ని కొడవండ్లు, మారుణాయుధాలు అంటున్నారన్నారు.

Paritala Sunitha Vs Jagan: చావు ఇంటికొచ్చి జేజేలా.. జగన్‌పై పరిటాల సునీత ఆగ్రహం
Paritala Sunitha Vs Jagan

శ్రీసత్యసాయి జిల్లా, ఏప్రిల్ 8: రాప్తాడు నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan reddy) పర్యటనపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Raptadu MLA Paritala Sunitha) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ పరామర్శకు వచ్చారా.. ఎన్నికల ప్రచారానికి వచ్చారా అంటూ ఫైర్ అయ్యారు. చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ చుట్టూ ఉన్న వాళ్లు ఆ కుటుంబాన్ని చూసి నవ్వుతున్నారన్నారు. ‘నువ్వు నవ్వుతున్నావో.. ఏడుస్తున్నావో అర్థం కావడం లేదు. మేము అనుకుని ఉంటే జగన్ ఇక్కడ అడుగు కూడా పెట్టలేడు. నన్ను, నా కుమారున్ని టార్గెట్ చేయడానికే జగన్ వచ్చాడు. ఆరోజు పులివెందులకు వెళ్తే నా భర్త పరిటాల రవిని అడ్డుకున్నావ్. ఈ రోజు మళ్లీ నన్ను నా కొడుకుని టార్గెట్ చేశావ్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను జగన్ చదువుతున్నారని విమర్శించారు. పరీక్షల్లో కాపీ కొట్టినట్టుగా పేపర్లు చూసి చదువుతున్నారని వ్యాఖ్యలు చేశారు. పాపిరెడ్డిపల్లిలో అనుకోకుండా ఒక సంఘటన జరిగిందని.. కానీ దాన్ని కొడవండ్లు, మారుణాయుధాలు అంటున్నారన్నారు. అలాంటివి పులివెందులలోని బాత్ రూముల్లో చంపేందుకు ఉపయోగిస్తారంటూ ఎద్దేవా చేశారు. గ్రామాల్లోకి వచ్చి చిచ్చు పెట్టాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. జగన్ చిన్నాన్ని చంపితే న్యాయం చేయమని చెల్లలు సునీత అడిగిందని.. చెల్లలుకు న్యాయం చేయలేని జగన్ ఇక్కడికొచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. తల్లి, చెల్లెళ్లకు న్యాయం చేయలేని జగన్.. లింగమయ్య కుటుంబానికి ఏం న్యాయం చేస్తారని నిలదీశారు. మాజీ సీఎంగా ఉండి ఎస్ఐ గురించి నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


పోలీసులను గుడ్డలూడదీస్తానని చెబుతున్నారని.. జిల్లా ఎస్పీతో పాటు పోలీసులు ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ‘పోలీసులు నీకు ఈ రోజు రెడ్ కార్పెట్ వేశారు. ఎస్ఐ మాకు ఫోన్ చేయించాడని బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పు. మేము భగవద్గీత మీద ప్రమాణం చేసి చెబుతాము’ అంటూ సవాల్ విసిరారు. జగన్ పర్యటనను పోలీసులు, టీడీపీ వాళ్లు ఎక్కడా అడ్డుకోలేదన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యల మీద కచ్చితంగా పోలీసులు స్పందించాలన్నారు. ఎంపీపీ ఎన్నికల గెలుచుకోలేక తోపు జీరో అయ్యాడని.. ఆ జీరో మాటలు విని ఇంత దూరం జగన్ వచ్చారంటూ ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యాఖ్యలు చేశారు.


కాగా.. పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఈరోజు కుంటిమద్ది గ్రామ సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న జగన్.. అక్కడి నుంచి రామగిరి మండలం పాపిరెడ్డిపల్లెకు చేరుకున్నారు. లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారికి అండగా ఉంటానని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాప్తాడు పర్యటన ముగించుకుని తిరిగి బెంగుళూరు బయలుదేరారు. అయితే బెంగళూరు నుంచి పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్ ప్రయాణించిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రోడ్డు మార్గంలో బెంగుళూరుకు బయలుదేరారు జగన్.


ఇవి కూడా చదవండి

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం.. ఏమైందంటే..

Controversy: సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే

Read Latest AP News and Telugu News

Updated Date - Apr 08 , 2025 | 03:13 PM