Share News

SI: ఎస్‌ఐ సుధాకర్‌కు అండగా ఉంటాం

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:29 AM

రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యా దవ్‌పై వైసీపీ చేస్తున్న కుట్ర పూరిత రాజకీయాలను తిప్పి కొట్టడంతో పాటు ఆయనకు అండగా ఉంటామని యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి యాదవ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో నక్కా రామారావు యాదవ భవనలో గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎస్‌ఐ సుధాకర్‌ నిబద్దతతో విధులు నిర్వహిస్తుంటే, ఆయనపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు.

SI: ఎస్‌ఐ సుధాకర్‌కు అండగా ఉంటాం
Speaking is Narayanaswamy Yadav, State General Secretary of the Yadava Sangam.

- యాదవ సంఘం నాయకులు

అనంతపురం కల్చరల్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యా దవ్‌పై వైసీపీ చేస్తున్న కుట్ర పూరిత రాజకీయాలను తిప్పి కొట్టడంతో పాటు ఆయనకు అండగా ఉంటామని యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి యాదవ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో నక్కా రామారావు యాదవ భవనలో గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎస్‌ఐ సుధాకర్‌ నిబద్దతతో విధులు నిర్వహిస్తుంటే, ఆయనపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఏర్పడినప్పటినుంచి భాష సంస్కృతి మా రిపోయిందని, ఆ పార్టీ శ్రేణులు వీధిరౌడీల్లా మాట్లాడుతున్నారని విమర్శిం చారు. వైసీపీ పాలనలో హత్యలు, అత్యాచారాలను ప్రేరేపిస్తే వాటిని అరిక ట్టేందుకు ప్రస్తుత పాలకులు కృషి చేస్తున్నారన్నారు. రామగిరి మండలంలో జరిగిన వర్గ హత్యను రాజకీయ పార్టీలకు ఆపాదించేందుకు మాజీ ఎమ్మెల్యే యత్నించడం సబబు కాదన్నారు. ఇదంతా రాజకీయ లబ్ధికోసం వైసీపీ చేస్తున్న కుట్ర అన్నారు. ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్‌ను హత్యచేసి డోర్‌ డెలివరీ చేస్తే జగన ఆ డ్రైవర్‌ కుటుంబాన్ని ఎందుకు పరామర్శిం చలేదని ప్రశ్నించారు. యాదవ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పరంధామ మాట్లా డుతూ... బీసీ అయిన లాయర్‌ నాగన్న ఎస్‌ఐ సుధాకర్‌పై చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. వైసీపీ హ యాంలో కురుబ ఎమ్మెల్యే శంకర్‌నారాయణపై చెప్పులు వేసినప్పుడు లాయర్‌ నాగన్న ఎందుకు మాట్లాడలేదన్నారు. పదేళ్లపాటు ఎస్‌ఐగా పనిచేస్తున్న సుధాకర్‌ యాదవ్‌ రూ. 3 లక్షల కారు కొనుక్కోకూడదా..? అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన డైరెక్టర్‌ కేశవయ్య, యాదవ సంఘం జిల్లా కార్య నిర్వాహక అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్‌, టీడీపీ పెనుగొండ అధ్యక్షుడు శ్రీరాములు యాదవ్‌, యువజన రాష్ట్ర నాయకుడు జైపాల్‌ యాదవ్‌, విద్యార్థి నాయకులు సురేష్‌ యాదవ్‌, నరసింహులు యాదవ్‌, ఆంజనేయులు, రాజు, బిల్లా వెంకటేష్‌, రమేష్‌, రామ్మూర్తి యాదవ్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 11 , 2025 | 12:30 AM