Home » Rave party Bangalore
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సోమవారం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు సీసీబీ పోలీసులు హేమను అదుపులోనికి తీసుకోవడం జరిగింది..
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ ప్రముఖ నటి హేమ అడ్డంగా బుక్ అయ్యారు. ఈ కేసులో తమ విచారణకు హాజరుకావాలని ఆమెకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
బెంగుళూరు డ్రగ్స్ కేస్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. విచారణ కు హాజరయ్యేందుకు సమయం కావాలని హేమ కోరినట్టుగా తెలుస్తోంది. తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని బెంగుళూరు సీసీబీకి హేమ లేఖ రాసింది. హేమ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకుంది. హేమకు మరో నోటీస్ ఇచ్చేందుకు బెంగుళూరు పోలీసులు సిద్ధమయ్యారు.
బెంగుళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న 8 మందికి సీసీబీ నోటీసులు జారీ చేసింది. నేడు బెంగళూరు సీసీబీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇవాళ నటి హేమ సహా 8 మందిని సీసీబీ విచారించనుంది. విచారణకు రాని పక్షంలో కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. రేవ్ పార్టీలో 101 మందిని పరీక్షించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ అయినట్టు తెలుస్తోంది.
బెంగళూర్ రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవ్ పార్టీలో సినీ సెలబ్రిటీలు, ఇతరులు పాల్గొన్నారు. పార్టీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న వాహనం ఉంది. మంత్రి, అతని సంబందీకులు ఎవరూ పార్టీలో పాల్గొనలేదని ప్రాథమిక సమాచారం.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.
బెంగళూరు ఎలకా్ట్రనిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ గురించి, అక్కడ పెద్దఎత్తున పాల్గొన్న సినీ నటులు, ప్రముఖుల గురించి తెలిసిందే. నిర్వాహకులను బెంగుళూరు పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా..
బెంగళూర్‌లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. లేదు, నేను హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ కాకమ్మ కబుర్లు చెప్పింది. వీడియోలు రిలీజ్ చేసి తర పరువును తానే తీసుకుంది. రేవ్ పార్టీలో తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని తెలిసింది. బెంగళూర్ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని చెప్పేందుకు మరో కచ్చితమైన ఆధారం లభించింది.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీగలాగితే డొంక కదులతోంది. రోజుకో షాకింగ్ విషయం వెలుగు చూస్తుండగా.. పోలీసులు చేసిన డ్రగ్స్ టెస్టుతో ఊహించని ఫలితాలు వచ్చాయి.
సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ మూలాలు బెజవాడలోనే ఉన్నాయా..? వన్‌టౌన్‌లోని ఆంజనేయ వాగుకు చెందిన వాసు ఆధ్వర్యంలోనే ఈ పార్టీ జరిగిందా..? ఒకప్పుడు పూరింట్లో కఠిక పేదరికం అనుభవించిన వాసు ఇప్పుడు రూ.కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు..? వాసు డాన్‌గా జిల్లాలో బెట్టింగ్ బుకీల వ్యవస్థ నడుస్తోందా..? అన్నీ తెలిసి పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారా..? వీటన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది..