Share News

Hema: హేమ బెంగళూర్ వెళ్లింది నిజమే.. ఏబీఎన్ చేతిలో ఆధారాలు

ABN , Publish Date - May 23 , 2024 | 05:09 PM

బెంగళూర్‌లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. లేదు, నేను హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ కాకమ్మ కబుర్లు చెప్పింది. వీడియోలు రిలీజ్ చేసి తర పరువును తానే తీసుకుంది. రేవ్ పార్టీలో తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని తెలిసింది. బెంగళూర్ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని చెప్పేందుకు మరో కచ్చితమైన ఆధారం లభించింది.

Hema: హేమ బెంగళూర్ వెళ్లింది నిజమే.. ఏబీఎన్ చేతిలో ఆధారాలు
hema

హైదరాబాద్: బెంగళూర్‌లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ (Hema) అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. ‘‘ లేదు.. నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను’’ అంటూ హేమ కాకమ్మ కబుర్లు చెప్పింది. వీడియోలు కూడా రిలీజ్ చేసి తన పరువు తానే తీసుకుంది. రేవ్ పార్టీలో తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని బయటపడింది. బెంగళూర్ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని చెప్పేందుకు మరో కచ్చితమైన ఆధారం లభించింది.


ఏబీఎన్ చేతిలో ఆధారం

నటి హేమ మే 18న (శనివారం) రోజున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. దానికి సంబంధించి ఏబీఎన్- ఆంధ్రజ్యోతికి ఆధారాలు లభించాయి. మధ్యాహ్నం 1.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు వెళ్లిన విమానంలో హేమ ఉన్నారు. ఇండిగో 6ఈ- 6305 విమానంలో హేమతో పాటు కాంతి, రాజశేఖర్, తదితరులు ఉన్నారు. హేమ తీసుకున్న ఫ్లైట్ టికెట్ కాపీ ఏబీఎన్ వద్ద ఉంది. శనివారం మధ్యాహ్నం 3.15 గంటలకు హేమ బెంగళూరు చేరుకుంది. అక్కడి నుంచి పార్టీ జరిగిన రిసార్ట్‌కు హేమ అండ్ కో వెళ్లారు.

hema-1.jpg


మత్తు పదార్థాలు

బెంగళూరు శివారులో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. పార్టీలో 101 మంది పాల్గొన్నారు. మద్యంతో పాటు డ్రగ్స్ తీసుకున్నారు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్, హైడ్రోగాంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు వాడారని తెలిసింది. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న 101 మందిలో రక్త పరీక్షలు చేయగా 85 మంది డ్రగ్స్ వాడినట్టు తేలింది. అందులో నటి హేమ కూడా ఉన్నారు. పదే పదే.. రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని ఆమె ఊదరగొట్టినప్పటికీ పక్కా ఆధారాలు లభ్యమవుతున్నాయి. హేమ ఫ్లైట్ టికెట్‌ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంపాదించింది. డ్రగ్స్ వాడిన 85 మందికి బెంగళూర్ నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు.

hema-2.jpg



Read Latest
Telangana News and National News

Updated Date - May 23 , 2024 | 06:22 PM