Home » Renuka Chowdary
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి, తుమ్మల యుగంధర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొంగులేటి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Telangana: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘మీరంతా ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. అది ఒక వ్యక్తి కోసం కాదు కాంగ్రెస్ విధానాలకు వేయండి. ఎంతమంది తిరుగుతుంటారు’’..
హైదరాబాద్, మే 05: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్(AP CM YS Jagan) పరువు తీసేశారు తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నాయకురాలు రేణుక చౌదరి(Renuka Chowdhury). జగన్ పరిపాలనా విధానాలపై(AP Capitals) సెటైర్లు గుప్పించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి..
Telangana: బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు? అని ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. ఏ హక్కుతో గాంధీ భవన్ వచ్చి తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని నిలదీశారు. బీజేపీ వాళ్ళకి దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణను పట్టుకోవాలన్నారు. నీరవ్ మోదీ, చాక్సీ పారిపోయినట్టే రేవణ్ణ పారిపోయారని తెలిపారు.
Telangana: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఖమ్మం పార్లమెంటు స్థానం హాట్‌సీట్‌గా మారింది. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఆశావాహులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి తరుపున రెండు సెట్లు నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా మరోనేత రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.
Telangana: ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సై అంటున్నారు. తనను ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయమంటే రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ లోక్‌సభకు పోటీ చేయమంటే చేస్తానని రేణుక తన మనసులో మాట బయటపెట్టారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఎంపీ.. ప్రధాని మోదీ, కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం టికెట్ విషయంలో ప్రలోభాలు పనిచేయవని గెలిచే నేతలకే కాంగ్రెస్ హై కమాండ్ టికెట్ ఇస్తుందని ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి రేణుక చౌదరి (Renuka Chowdary) తెలిపారు.
కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి నేడు రాజ్యసభ ఎన్నికల నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు. నేటితో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుంది
రాముడిని బీజేపీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని వివరించారు. హడావిడిగా 22వ తేదీన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని శంకరాచార్యులు, మఠాధిపతులు వ్యతిరేకించారని తెలిపారు.
Telangana: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సోమవారం గాంధీ భవన్ నుంచి మహిళలతో కలిసి రేణుకాచౌదరి బస్సులో ప్రయాణించారు.