AP Elections 2024: ఏపీ సీఎం జగన్ పరువు తీసేసిన కాంగ్రెస్ నాయకురాలు..
ABN , Publish Date - May 06 , 2024 | 05:13 PM
హైదరాబాద్, మే 05: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్(AP CM YS Jagan) పరువు తీసేశారు తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నాయకురాలు రేణుక చౌదరి(Renuka Chowdhury). జగన్ పరిపాలనా విధానాలపై(AP Capitals) సెటైర్లు గుప్పించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి..
హైదరాబాద్, మే 05: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్(AP CM YS Jagan) పరువు తీసేశారు తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నాయకురాలు రేణుక చౌదరి(Renuka Chowdhury). జగన్ పరిపాలనా విధానాలపై(AP Capitals) సెటైర్లు గుప్పించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తొలుత తెలంగాణ అంశాలపై మాట్లాడిన ఆమె.. ఆ తరువాత ఏపీలో రాజకీయాంశాలపై కీలక కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా జగన్‌పై తనదైన శైలిలో పంచ్‌లు వేశారు.
ప్రధానంగా రాజధానుల అంశాన్ని ముందుకు తీసుకువస్తూ.. సీఎం జగన్ గాలి తీసేశారు. ఏపీకి జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఆ మూడు రాజధాను ఇవేనంటూ.. వాటి పేర్లు కూడా చెప్పారు. ఇంతకీ ఆ మూడు రాజధానులు ఏంటో తెలుసా? రేణుకా చౌదరి ప్రకారం.. మూడు రాజధానుల్లో ఒకటి డ్రగ్స్ మరొకటి మర్డర్స్, మూడో రాజధాని నిరుద్యోగం అని.. వీటినే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఏర్పాటు చేశారని రేణుకా చౌదరి తనదైన శైలిలో మార్క్ సెటైర్స్ వేశారు.
బీజేపీ సర్కార్‌పై ఫైర్..
అంతకు ముందు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపైనా రేణుకా చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. ఏ అధికారంలో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారని ప్రశ్నించారు. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. ఏ హక్కుతో గాంధీ భవన్‌కు వచ్చి తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని కేంద్ర సర్కార్‌ను ప్రశ్నించారు. బీజేపీ వాళ్లకు దమ్ముంటే ప్రజల్ రేవణ్ణను పట్టుకోవాలని రేణుకా చౌదరి సవాల్ విసిరారు. నీరవ్ మోదీ, చాక్సీ పారిపోయినట్టే రేవణ్ణ పారిపోయాడని విమర్శించారు. ప్రజ్వల్ని బలపరిస్తే తనను బలపర్చినట్టేనని మోదీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు ఇంత చేస్తుంటే ఎన్నికల అధికారులు సైలెంట్ గా ఉంటున్నారని విమర్శించారు. బ్రిజ్ భూషణ్ అన్ని అరాచకాలు చేస్తే మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారని విమర్శించారు. దేశంలో ఉన్న ముస్లింలకు మోదీ ప్రధాని కాదా? అని ప్రశ్నించారు. చైనా మన గడప తొక్కి ఇంట్లో ఉంటే మోదీ మాట్లాడడం లేదని విమర్శించారు. దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని పార్లమెంట్‌కి వస్తున్నారని.. జవాన్లు, రైతులు అనే రెండు పెద్ద సెక్యులర్ ఫోర్సెస్ దేశంలో ఉన్నాయన్నారు. పెద్ద ఛాతీ ఉండడం కాదు.. దానిలో గుండె, మనసు కూడా ఉండాలంటూ ప్రధాని మోదీకి చురకలంటించారు రేణుకా చౌదరి.