Raghu Ramreddy: మన నెత్తిమీద 7 లక్షల కోట్ల అప్పు పెట్టిన బీఆర్ఎస్..
ABN , Publish Date - May 09 , 2024 | 11:50 AM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి, తుమ్మల యుగంధర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొంగులేటి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి (Renuka Chowdary), తుమ్మల యుగంధర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొంగులేటి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు గల్లంతు చేయాలని అఖిలపక్ష పార్టీలు కోరాయి.
CPM Raghavulu: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారకుడు జగనే
ఈ ఆత్మీయ సమావేశంలో రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ 10 ఏళ్ల పాలన గురించి మన వాళ్ళు చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 140 రోజుల్లో చేసిన హామీలు మన వాళ్ళు చెప్పారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మన నెత్తి మీద రూ.7 లక్షల కోట్ల అప్పు వేశారన్నారు. బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఉన్న ఉద్యోగాలు పీకేశారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్నారన్నారు. కొవిడ్ సమయంలో వ్యాక్సిన్ ఇవ్వకుండా డప్పు కొట్టమని చెప్పారని రఘురాం రెడ్డి అన్నారు. రెండు పార్టీలను పక్కకు పెట్టాలని.. రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉందన్నారు. జిల్లాలో ముగ్గురు శక్తివంతమైన నాయకులు ఉన్నారన్నారు. ఖమ్మం జిల్లాకు సేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని.. 5 ఏళ్లు మీతోనే ఉంటానని రఘురాం రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: మాధవీలతకు శివసేన మద్దతు..
AP Election 2024: ఆ 48 గంటలు కీలకం అప్రమత్తంగా ఉండండి
Read latest Telangana News And Telugu News