Home » Revanth Reddy
ప్రభుత్వానికి తాను అందించిన వినతిపత్రాలపై సానుకూల స్పందన రాకపోవడంతో సామాజిక మాద్యమం ఫేస్బుక్లో ఆమె ఒక పోస్టు పెట్టారు. తనను పీఆర్ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారని మాజీ పోలీస్ అధికారి నళిని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలో ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రేంవత్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారు.
దేశ చరిత్రలోనే ఒకేసారి రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ ఎప్పుడు జరగలేదని.. ఇదే తొలిసారి అని మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అది కూడా రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.
రేపు ఉదయం 10 గంటలకు ప్రజా భవన్ లేదా సెక్రెటరీయేట్‌లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.
పంట రుణాల మాఫీపై రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి మరో శుభవార్త చెప్పారు. ఊహించిన దానికన్నా ముందే ఈ నెల 18 నుంచే అమలు చేస్తామని ప్రకటించారు. రూ.లక్ష లోపు ఉన్న రుణాల సొమ్మును ఆ రోజు సాయంత్రం కల్లా రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు.
తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశంపై హై ఓల్టేజ్ డిస్కషన్ జరుగుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ వేయడం, దానిని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంగళవారం విచారణ జరిగింది. కమిషన్ చైర్మన్‌ను మార్చాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతో కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్. నరసింహరెడ్డి నేతృత్వంలో కమిషన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది
లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ మరింత బలహీనపడుతూ వస్తోంది. గతంలో కేసీఆర్‌ను హీరో అంటూ ప్రశంసించిన వాళ్లే.. అధికారం పోయే సరికి.. కేసీఆర్ జీరో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలస జోరు కొనసాగుతుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్.. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ చేరనున్నారు. ఆయనతోపాటు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు సైతం పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.