Narasimha Reddy: కమిషన్ నుంచి తప్పుకున్నా.. సీఎం రేవంత్‌ను కలవలేదు!
ABN , Publish Date - Jul 16 , 2024 | 08:49 PM
తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశంపై హై ఓల్టేజ్ డిస్కషన్ జరుగుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ వేయడం, దానిని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంగళవారం విచారణ జరిగింది. కమిషన్ చైర్మన్‌ను మార్చాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతో కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ: తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశంపై హై ఓల్టేజ్ డిస్కషన్ జరుగుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ వేయడం, దానిని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంగళవారం విచారణ జరిగింది. కమిషన్ చైర్మన్‌ను మార్చాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతో కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహా రెడ్డి (Justice Narasimha Reddy) మీడియాతో మాట్లాడారు.
ఏం మాట్లాడలే..!!
‘సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కమిషన్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారని తెలిసింది. విచారణ సమయంలో మీడియా సమావేశం పెట్టానని ఒక అంశం ముందుకొచ్చింది. మీడియా సమావేశంలో నేను ఎలాంటి అంశాలు మాట్లాడలేదు. అయినప్పటికీ సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు కమిషన్ నుంచి తప్పుకున్నా. నాపై ఎక్కడ కోర్టు తప్పుగా అభిప్రాయం వ్యక్తం చేయలేదు. విద్యుత్ ఒప్పందాలపై ఇప్పటికే విచారణ పూర్తి చేశాను. నివేదిక పూర్తయ్యింది. వాస్తవానికి శనివారం నివేదిక సబ్‌మిట్ చేయాలనుకున్నా. ఇంతలో పిటిషన్ రావడంతో సమర్పించలేదు. కమిషన్ గురించి పిటిషన్ వేస్తే తప్పేమీ లేదు అని’ మాజీ జస్టిస్ నరసంహా రెడ్డి స్పష్టం చేశారు.
రేవంత్‌ను కలువలే..!!
‘నేను ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డిని కలువలేదు. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదు. పవర్ కమిషన్ జీవో ఇచ్చింది. నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు అంటున్నారు.. ఎవరికి చెంపపెట్టో అందరికి తెలుసు అని’ మాజీ జస్టిస్ నరసింహా రెడ్డి తేల్చి చెప్పారు.
CM Revanth Reddy: అటవీ సంపదపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
అధికారం లేదంటూ..!!
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహా రెడ్డితో పవర్ కమిషన్ వేసింది. ఆ కమిషన్‌కు తనను విచారణకు పిలిచే అధికారం లేదని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఆ పిటిషన్ విచారించింది. పవర్ కమిషన్ చైర్మన్‌ను తప్పించాలని స్పష్టం చేసింది. ఆ క్రమంలో నరసింహా రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
Kodanda Reddy: బీఆర్ఎస్ పాఠాలు నేర్పాలని చూస్తోంది: కాంగ్రెస్ నేత కోదండరెడ్డి