Share News

Telangana: ఢిల్లీకి సీఎం రేవంత్.. ప్రధాన అజెండా అదే..!

ABN , Publish Date - Jul 20 , 2024 | 12:50 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలో ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రేంవత్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారు.

Telangana: ఢిల్లీకి సీఎం రేవంత్.. ప్రధాన అజెండా అదే..!
Rahul and Revanth

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలో ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రేంవత్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు.. పలువురు కేంద్రమంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవుల పంపకం పూర్తవ్వడంతో.. మిగిలిన పదవులు ఎవరెవరికి కేటాయించాలి.. పదవులు దక్కని సీనియర్లను ఎలా గౌరవించాలనే విషయంపై కూడా అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు. మరోవైపు వరంగల్‌లో ఏర్పాటుచేయబోయే భారీ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ అమలు చేయడంతో రాహుల్‌తో సభ పెట్టిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఈ విషయాన్ని హైకమాండ్‌కు రేవంత్ తెలియజేయనున్నారు.

KTR: కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయ్.. మేడిగడ్డ నిండుకుండలా కావడంపై కేటీఆర్ హర్షం..


కేంద్రమంత్రులతో..

రెండు రోజుల పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నారు. విభజన హామీల అమలుతో పాటు.. కొత్త రుణాలు, ప్రాజెక్టుల మంజూరుపై వివిధ శాఖల మంత్రులతో సమావేశమవుతారు. రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసే అవకాశం ఉంది. మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. పెండింగ్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని కోరనున్నారు.

KTR: సర్కారు మార్గదర్శకాలే మాఫీకి మరణ శాసనాలు..


ఖర్గే, రాహుల్‌‌తో..

సీఎం రేవంత్ రెడ్డి ఎఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కలవనున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలపై ఆయన చర్చించనున్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తుండటంతో మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో చర్చించి.. ఎవరిని కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకోవాలనేదానిపై రేవంత్ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించడంతో పాటు.. చేరికల అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఎంపికపై ప్రస్తుత ఢిల్లీ పర్యటనలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. గత ఢిల్లీ పర్యటనలోనే పీసీసీ చీఫ్ ఎంపికపై ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ.. పార్టీలో ఏకాభిప్రాయం రాకపోవడంతో పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదాపడింది. ఈసారి మాత్రం కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.


TGPSC: డిసెంబరుకు గ్రూప్‌-2 వాయిదా..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jul 20 , 2024 | 12:52 PM