Home » Road Accident
కర్నూలు జిల్లా: కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు.
నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా, బుచ్చి మండలం, దామర మడుగు వద్ద ముంబాయి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొంది.
అతి వేగంతో వాహన ప్రయాణం ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందులో సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలో రాంసాన్పల్లి శివారులో 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబమే బలైపోయింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం తాడ్కూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(35), సునీత(30) దంపతులకు కుమారుడు నగేష్(7) ఉన్నాడు. వీరు ముగ్గురు శుక్రవారం బైక్‌పై తాడ్కూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
హైదరాబాద్ - విజయవాడ హైవేపై(Hyderabad - Vijayawada High Way) నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ఆ స్థాయిలోనే ప్రమాదాలూ జరుగుతుండటం అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్ - విజయవాడ హైవే(NH-65)పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్స్‌ని అధికారులు గుర్తించారు.
Andhrapradesh: శ్రీశైలంలో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలో బొలేరో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. అయితే లోయలో పడి చెట్టుకు ఢీ కొట్టి వాహనం ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాద సమయంలో బొలేరో వాహనంలో 15 మంది ప్రయాణిస్తున్నారు.
ఎన్నికల ప్రభావంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిలో వాహన రద్దీ బుధవారం కూడా కొనసాగింది. జాతీయ రహదారిపై బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. ఓ ఘటనలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీలోని స్వస్థలానికి వెళ్లిన ఓ యువకుడు తిరుగుప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి బలైపోయాడు. విజయవాడ-హైదరాబాద్ హైవేలోని పంతంగి టోల్‌గేటు సమీపంలో ఆగి ఉన్న కంటెయినర్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో కొనికల దీపక్ రాజ్ (29) అనే యువకుడు బుధవారం మరణించాడు.
Andhrapradesh: ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పసుమర్రు దగ్గర బస్సు, టిప్పర్ ఢీ కొని అగ్ని జ్వాలలు ఎగసిపడటంతో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. అక్కడ బైపాస్ రోడ్ పనులు సాగుతున్న క్రమంలో తగిన రహదారి భద్రత చర్యలు తీసుకోవడం, వేగ నియంత్ర చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం సంభవించి ఉండేది కాదని అన్నారు.
పల్నాడు జిల్లా పసుమర్రు రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు-టిప్పర్ ఢీ కొని చిన్నగంజాంకు చెందిన ఆరుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
పల్నాడు జిల్లా: చిలకలూరిపేట వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. చీరాల నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. టిప్పర్ లారీని ఢీ కొంది
తమిళనాడులోని తిరువన్నామలైకి చెందిన తమిద్‌మారన ఆ రో తరగతి చదువుతున్నాడు. బడికి వేసవి సెలవులు వచ్చాయి. తన మేన మామ విజయ్ క్యాంటర్ వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సరుకు రవాణా కోసం వివిధ ప్రాంతాలకు వెళు తుంటాడు. మేనల్లుడికి మామ వెంట వెళ్లి ఊళ్లన్నీ తిరగాలనినిపించింది. ‘మామా.. మా మా.. నేనూ వస్తా నీ వెంట..’ అని గోముగా అడిగాడు. బహుషా తను.. ‘వద్దురా.. ఎండలకు తట్టుకోలేవు..’ అని సముదాయించి ఉంటాడు. ముద్దుల మేనల్లుడు బుంగమూతి పెట్టగానే.. చెల్లెకి నచ్చజెప్పి వెంట తీసుకెళ్లింటాడు.