Home » Road Accident
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తి అయ్యింది. మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అనంత అర్బనకు అప్పటి విపక్ష నేత వైఎస్ జగన, నాటి ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి అలివిగాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక విస్మరించారు. నగర రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చిన అనంత వెంకటరామిరెడ్డి.. నిజంగానే మాట నిలబెట్టుకున్నారు. అనంత రూపురేఖలను బళ్లారి బైపాస్ నుంచి పంగళ్ రోడ్డు వరకూ ప్రతిష్టాత్మక రోడ్డును ‘వంకర’గా మార్చేశారు. అప్పట్లో ‘సుందర అనంత-మన అనంత’ పేరుతో ...
జీవనోపాధి కోసం ఓ వ్యక్తి బుధవారం ఎద్దులబండిలో ఇసుక తరలిస్తుండగా వెనుక నుంచి కంటెయినర్ లారీ ఢీకొనడంతో ఎద్దు మృతిచెందింది. అతడు గాయాల పాలయ్యాడు. సోమందేపల్లికి చెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి అదే మండలంలో వెలగమాకుల పల్లి సమీపం లోని వంక నుంచి ఎద్దులబండిలో ఇసుక తరలిస్తున్నా డు. అతడు 44వ జాతీయ రహదారి మీదుగా సోమం దేపల్లికి వస్తుండగా మార్గమధ్యలో పాపిరెడ్డిపల్లి వద్ద తెల్లవారుజామున 6గంటల సమయంలో ఓ కంటెయినర్ లారీ ఎద్దులబండిని వెనుక నుంచి ఢీకొంది.
గత కొన్ని రోజులుగా దక్షిణ చైనా(south China)లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్(Guangdong province)లోని మీజౌ నగరంలో హైవేలోని ఒక భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత చెందగా, అనేక మంది గాయపడ్డారు.
Telangana: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రాహిల్‌ను రెండు వారాల వాటు అరెస్టు చేయకుండా ధర్మాసనం స్టే విధించింది. గతంలో రాహిల్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులు అపీల్‌కు వెళ్లారు. ఈరోజు (మంగళవారం) పోలీసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
అధికారం చేతిలో ఉన్నా సొంతూరి చుట్టు పట్ల గ్రామాలకు తారురోడ్డు వేయించుకోలేకపోయాడనే విమర్శలు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి మూటగట్టుకున్నాడు. ఆత్మకూరు మండలంలో బి. యాలేరు నుంచి తగరకుంట వరకూ డబుల్‌లేన తారు రోడ్డు నిర్మాణం చేయుటకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ ఆ పనులు అరకొరగా చేశారు. కల్వర్టుల...
ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటు చేసుకుంది. ట్రక్కును గూడ్స్ వాహనం ఢీకొనడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెమెతారా జిల్లా పాతర్రా గ్రామానికి చెందిన తిరయ్య కుటుంబసభ్యులు ఆదివారం ఓ వేడుకకు హాజరై రాత్రి తిరిగి వస్తున్నారు.
కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం, దేవాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రమాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్(45) మృతి చెందారు.
కొమురం భీం: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బెజ్జురు మండలం, పోతేపల్లి సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి.
బుక్కపట్నం, ఏప్రిల్ 25: మండలంలోని లింగప్పగారిపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మృతిచెందారు. లింగప్పగారిపల్లి గ్రామానికి చెందిన నరసానాయుడు(42), ప్రభాకర్(33) సిద్దరాంపురం నుంచి స్వగ్రామమైన లింగప్పగారిపల్లికి ద్విచక్రవాహనంలో వెళ్తున్నారు.
సూర్యాపేట జిల్లా: కోదాడ శివారు దుర్గాపురం వద్ద హైదరాబాద్- విజయవాడ 65వ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.