TS News: రాహిల్‌ను అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:18 PM
Telangana: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రాహిల్‌ను రెండు వారాల వాటు అరెస్టు చేయకుండా ధర్మాసనం స్టే విధించింది. గతంలో రాహిల్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులు అపీల్‌కు వెళ్లారు. ఈరోజు (మంగళవారం) పోలీసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్, ఏప్రిల్ 30: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో (Jubilee Hills Road Accident Case) బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు హైకోర్టులో (Telangana High Court) ఊరట లభించింది. రాహిల్‌ను రెండు వారాల వాటు అరెస్టు చేయకుండా ధర్మాసనం స్టే విధించింది. గతంలో రాహిల్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులు అపీల్‌కు వెళ్లారు. ఈరోజు (మంగళవారం) పోలీసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రాహిల్ తరపు న్యాయవాది కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వారాల పాటు రాహిల్‌ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
AP Elections: బంపర్ ఆఫర్.. కూపన్ నింపితే లక్ష మీదే..
కాగా.. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కారుపై స్టిక్కర్ ఆధారంగా మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా గుర్తించిన పోలీసులు.. ప్రమాద సమయంలో కారులో షకీల్ కొడుకు రాహిల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే అనూహ్యంగా కారు తానే నడిపాను అంటూ ఆఫ్నాన్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. అయితే గతంలో రాహిల్‌ను తప్పించేందుకు కొందరు పోలీసులు ఉన్నతాధికారులు ప్రయత్నం చేసినట్లు కూడా సమాచారం.
Lok Sabha Polls 2024: ఇద్దరి టార్గెట్ డబుల్ డిజిట్.. పైచేయి ఎవరిది..?
మరోసారి ఈ కేసును రిఓపెన్ చేసిన పోలీసులు.. బాధితుల నుంచి మళ్లీ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న రాహిల్‌ను ఏప్రిల్ 8న పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా.. రాహిల్‌ను ఈనెల 18 వరకు అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో బెయిల్ రావడంతో రాహిల్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే రాహిల్‌కు బెయిల్ ఇవ్వడంపై పోలీసులు హైకోర్టులో అపీల్‌కు వెళ్లగా.. మరో రెండు వారాల పాటు రాహిల్‌ను అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
Madhukar Reddy: కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు..
Amit Shah: రాజకీయాల్ని దిగజారుస్తున్నారంటూ.. నకిలీ వీడియోపై తీవ్రంగా మండిపడ్డ అమిత్ షా
Read Latest Telangana News And Telugu News
10th ఫలితాల కోసం క్లిక్ చేయండి..