Share News

Highway Collapse: కుప్పకూలిన రోడ్డు.. 19 మంది మృతి, అనేక మందికి గాయాలు

ABN , Publish Date - May 01 , 2024 | 12:36 PM

గత కొన్ని రోజులుగా దక్షిణ చైనా(south China)లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌(Guangdong province)లోని మీజౌ నగరంలో హైవేలోని ఒక భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత చెందగా, అనేక మంది గాయపడ్డారు.

Highway Collapse: కుప్పకూలిన రోడ్డు.. 19 మంది మృతి, అనేక మందికి గాయాలు
19 people dead in a collapsed road in south China

గత కొన్ని రోజులుగా దక్షిణ చైనా(south China)లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌(Guangdong province) మీజౌ నగరం హైవేలోని ఒక భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత చెందగా, అనేక మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరుగగా సమాచారం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. 18 వాహనాల్లో డజన్ల కొద్దీ ప్రజలు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు.


అందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. వీడియోలో హైవేపై లోతైన గొయ్యి ఏర్పడగా అందులో పెద్ద ఎత్తున ధ్వంసమైన వాహనాలు కనిపిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి దాదాపు 500 మందిని సైట్‌కు పంపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో S12 హైవేలో కొంత భాగం రెండు వైపులా మూసివేయబడిందని, ఇతర వాహనాలు పక్కదారుల్లో వెళ్లాలని స్థానిక అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ ప్రమాదం నేపథ్యంలో పెద్ద శబ్ధం వినిపించిందని, రోడ్డుపై కొన్ని మీటర్ల వెడల్పు ఉన్న బిలం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.


ఈ ప్రాంతంలో ఇటీవలి రోజుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, 30 మందిని ఆసుపత్రికి తరలించారని అక్కడి మీడియా తెలిపింది. గ్వాంగ్‌జౌ నగరం హాంకాంగ్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు రాజధాని. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ చైనాలోని అతిపెద్ద ప్రావిన్సులలో ఒకటి. దీనిని చైనా పారిశ్రామిక ప్రాంతం అని కూడా అంటారు. ఈ ప్రాంతంలో అనేక కర్మాగారాలు ఉన్నాయి. ఇవి పెద్ద మొత్తంలో చైనా వస్తువులను ఎగుమతి చేస్తాయి. ఇంతకుముందు చైనాలోని గ్వాంగ్‌జౌ నగరాన్ని తాకిన సుడిగాలి కారణంగా ఐదుగురు మరణించగా, 33 మంది గాయపడ్డారు.


ఇది కూడా చదవండి:

Bank Holidays: మేలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్

Airlines: ఒకప్పుడు ఫ్లైట్ అటెండెంట్.. ఇప్పుడు అదే ఎయిర్‌లైన్స్‌కు బాస్


Read Latest International News and Telugu News

Updated Date - May 01 , 2024 | 12:58 PM