Home » Road Accident
హరియాణాలో చిన్నారులతో వెళ్తున్న స్కూల్ బస్సు.. డ్రైవర్ నిర్లక్ష్యంతో బోల్తా పడిన ఘటన మరవకముందే.. హిమాచల్ ప్రదేశ్‌లో(Himachal Pradesh) భక్తులతో వెళ్తున్న మరో బస్సు బోల్తా పడింది.
Andhrapradesh: ఆ ముస్లిం కుటుంబీకులు ఎంతో ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకున్నారు. తర్వాతి రోజు జరిగిన అనుకోని ఘటన వారిని విషాదంలోకి నెట్టేసింది. అప్పటి వరకు తమతో కలిసి ఉన్న బాలుడిని ఒక్కసారిగా ప్రమాదం చుట్టిముట్టి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీమున్నీరుగా విలపించారు. అనకాపల్లి జిల్లాలో అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బీభత్సానికి ఓ బాలుడు బలయ్యాడు. శుక్రవారం ఉదయం కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న టిఫిన్ వాహనంపైకి కాలేజ్ బస్సు దూసుకెళ్లింది.
హర్యానాలో గురువారం ఉదయం ఆరుగురు విద్యార్థులను చిదిమేసిన స్కూల్ బస్ ఘటనలో ప్రిన్సిపల్ సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బస్సు డ్రైవర్, పాఠశాల కార్యదర్శి కూడా ఉన్నారు. డ్రైవర్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని రక్తంలో ఆల్కహాల్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
వనపర్తి(Wanaparthy) జిల్లాలో బుధవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ద్విచక్రవాహనదారులు ఇద్దరు మృతి చెందిన ఘటన రాజపేటలో చోటు చేసుకుంది.
తమిళనాడులో ఓ కారు బుధవారం ఉదయం బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురై జిల్లాలోని విరుదునగర్ - మధురై నాలుగు లేన్ల జాతీయ రహదారిపై శివరకోట్టై వద్ద ఈ ప్రమాదం జరిగింది.
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు.
పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసీ వ్యాన్‌ను ఓ లారీ ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదంలో అక్కడక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
సంగారెడ్డి జిల్లాలో పెళ్లింట ఓ రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. తెల్లవారితే పెళ్లి.. సంతోషంగా పెళ్లి కూమార్తెను తీసుకువచ్చేందుకు వరుడి తరఫు బంధువులంతా కలిసి ట్రాక్టర్లో వెళ్తుండగా ప్రమాదవశాత్తూ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడగా, మరో 22 మందికి గాయాలయ్యాయి.
డ్రైవర్‌కు నిద్ర మత్త ఆవహించిందో లేదంటే అతి వేగం కారణమో కానీ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ ఓ డివైడర్‌ను ఢీకొట్టాడు. అంతే.. కారులో ఉన్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా పాల్వంచలో వివాహానికి హాజరైంది ఓ కుటుంబం. తిరిగి ఆనందంగా స్వగ్రామానికి బయలుదేరింది.
సంగారెడ్డి జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కూతుర్ని తీసుకెళ్లేందుకు ట్రాక్టర్‌పై వెళ్లిన ఓ బృందం కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిలింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది.