Home » Road Accident
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. కనీసం ఎమ్మెల్యేగా ఆమె పదవిని చేపట్టి ఏడాది కూడా కాకమునుపే కన్నుమూశారు. లాస్య నందితకు ఎమ్మెల్యే గా కాలం కలిసి రాలేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తొలుత లిప్ట్లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి ఆమె బయటి పడ్డారు.
Andhrapradesh: తిరుమలలో ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం తిరుమల యాత్రి సముదాయం 4 వద్ద వేగంగా దూసుకువచ్చిన ట్రాక్టర్ అదుపుతప్పి మూసి ఉన్న గేటును బలంగా ఢీ కొట్టింది.
హైదరాబాద్: నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది... మంగళవారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అవుటర్ రింగ్ రోడ్డుపై నుంచి కిందకు పడిపోయింది. అవుటర్ రింగ్ రోడ్డుపై నుంచి అత్యంత వేగంగా వచ్చిన కారు.. అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది.
Telangana: నగరంలోని బోయిన్పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓల్డ్ బోయిన్పల్లి నుంచి మల్లారెడ్డి గార్డెన్ వైపు వెళ్తున్న క్రమంలో వేగంగా దూసుకొచ్చి మరో కారును కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఢీకొని కారు ఆగిపోయింది. కారు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్: ఎల్బీనగర్లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల సీఐ ప్రాణాన్ని బలికొంది. కారు యూటర్న్ తీసుకుంటూ.. రాంగ్ రూట్లో వెళ్లగా ఆ రహదారిలో వస్తున్న బైక్ కారును ఢీ కొట్టింది.
కరీంనగర్ జిల్లా: శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ శివారులో జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
తిరుపతి: ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున నాయుడుపేట- పూతలపట్టు ప్రధాన రహదారిలోని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ డైరీ సమీపంలో ఈ ఘటన జరిగింది.
Telangana: భాగ్యనగరంలోని వరుసగా జరుగుతున్న హిట్ అండ్ రన్ ప్రమాదాలతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలతో ఢీకొట్టి ఆపై ఆపకుండా పరారవుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా అనేక మంది అమాయక ప్రజలు బలవుతున్న పరిస్థితి.
ఒడిశా(Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారాపుట్ జిల్లాలోని బోరిగుమ్మ ప్రాంతంలో రెండు బైక్లు, ఆటో, ట్రాక్టర్, డీసీఎం ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 13 మంది గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ ఘాట్ రోడ్ వద్ద ఓ వంతెనపై బహుళ వాహనాలు ఢీకొన్నాయి. మూడు ట్రక్కులు, రెండు కార్లు ఢీకొనడంతో.. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలవ్వగా.. చికిత్స నిమిత్తం వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.