Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:32 AM
Road Accident: కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి వాసులు మృత్యువాతపడ్డారు. వారణాసిలో రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ, అతడి భార్య ఈ ప్రమాదంలో మరణించారు.

సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 24: మహాకుంభమేళాకు ఎంతో మంది భక్తులు తరలివెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. అందరిలాగే సంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు భక్తులు మహాకుంభమేళాకు వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడంపై వారంతా ఎంతో భక్తిపారవశ్యంతో మునిగిపోయారు. తిరిగి సొంత జిల్లాకు వెళ్లేందుకు పయనమయ్యారు. కానీ అంతలోనే అనుకోని ఘటన పెను విషాదాన్ని నింపింది. వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతకీ ప్రమాదం ఎక్కడ జరిగింది.. చనిపోయిన వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి జిల్లా వాసులు మృత్యువాతపడ్డారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా భక్తులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వస్తుండగా వారికి ఎదురుగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయే సమయంలో అటుగా వస్తున్న టిప్పర్‌ను కారు బలంగా ఢొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి (46), భార్య విలాసిని (40) మృతి చెందారు. అలాగే కారు డ్రైవర్ మల్లారెడ్డికి కూడా మృత్యువాతపడ్డారు.
శాసనసభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు..
వీరంతా వెంకటరామిరెడ్డి స్వగ్రామం న్యాల్‌కల్ మండలం మామిడ్గీ వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే వారణాసి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రమాద విషయాన్ని మృతుల కుటుంబసభ్యులకు తెలియజేశారు. కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదం గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మామిడ్గీ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
బస్సు దగ్ధం..
మరోవైపు... మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లె బోయిన్‌పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై సలీం ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాదు వెళ్తుండగా వెనక టైరు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
అటు జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వడ్డేపల్లి మండలం శాంతినగర్ పట్టణంలో బొలెరో వాహనం, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు బుడమోర్సు గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న మురళిగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల
ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Read Latest Telangana News And Telugu News