Share News

Road Accident: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

ABN , Publish Date - Mar 02 , 2025 | 07:58 AM

నల్గొండ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Road Accident: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
Road Accident

నల్లగొండ జిల్లా: చిట్యాల మండలం, పెద్దకాపర్తి వద్ద 65వ జాతీయ రహదారిపై ఆదివారం (Sunday) తెల్లవారుజామున (Early Morning) రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతి వేగంగా వస్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనకాలే వస్తున్న రెండు కార్లు (Two Cars), కంటైనర్ లారీ (Container Lorry) ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి (Two dead) చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి నల్లగొండకు వెళ్తుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ వార్త కూడా చదవండి..

రైతులను భయభ్రాంతులకు గురిచేసిన అఘోరి...


మరోవైపు పల్నాడు జిల్లా, సత్తెనపల్లిలోని శివాజీ నగర్‌లో ముగ్గురు యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో తమ్మిశెట్టి ఆంజనేయులు అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసి.. రూ. 3 వేలు నగదు ఎత్తుకుపోయారు. గాయపడిన ఆంజనేయులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారవ్వడంతో వారి కోసం గాలిస్తున్నారు. గతంలోను పలు మార్లు ఇదే తరహాలో యువకులు వీరంగం సృష్టించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.


ఇంకోవైపు నంద్యాల జిల్లా.. ఆత్మకూరులోని నీలితొట్ల వీధిలో వాంతులు, విరేచనలతో మరొక వ్యక్తి మృతి చెందడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. వాంతులు విరేచనాలతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ రామచంద్ర నాయుక్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో మున్సిపల్ కమిషనర్ రమేష్... సుమారు 200 మందితో పట్టణంలో ముమ్మరంగా పారిశుద్ధ్యచర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీతో వినాశనం

కొలువుల పత్రాలు లేకున్నా జీతాలు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 02 , 2025 | 07:58 AM