Home » Russia-Ukraine war
రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine War) మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి.. మొదట్లో ఈ యుద్ధం రోజుల్లోనే ముగుస్తుందని అంతా భావించారు. కానీ.. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. ప్రారంభ రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా (Russia) ఆధిపత్యం చెలాయించింది. కానీ, ఆ తర్వాత పాశ్చాత్య దేశాల సహకారంతో ఉక్రెయిన్ (Ukraine) కూడా విజృంభించడం మొదలుపెట్టింది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణ.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందా? అంటే అవుననే బదులిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. తమకు అమెరికా, జర్మనీతో పాటు ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి.. ఉక్రెయిన్ వివాదం ‘వరల్డ్ వార్ 3’గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఉక్రెయిన్‌లో మళ్లీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ నగర శివార్లలోని మార్కెట్‌పై ఆదివారం క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటలో 13 మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు కావొస్తున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. మొదట్లో రష్యా ఆధిపత్యం చెలాయించింది కానీ, పాశ్చాత్త దేశాల సహకారంతో ఉక్రెయిన్ కూడా విజృంభించింది. రష్యా దాడులకు కౌంటర్ ఇస్తూ ఇస్తోంది.
గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా మూడో ప్రపంచ యుద్ధానికి పునాది వేయనుందా? అంటే.. జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ నుండి వెలువడిన రహస్య పత్రాల్లోని సమాచారం అవుననే చెప్తోంది. ఈ కీలక సమాచారం బైల్డ్ వార్తాపత్రికలో ప్రచురితమైంది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 20 నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. దీంతో..
Russia: మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తేనే పురుషుల్ని కఠినంగా శిక్షిస్తారు. మరోసారి మహిళల జోలికి వెళ్లినివ్వకుండా తగిన బుద్ధి చెప్తారు. అలాంటిది.. అత్యాచారానికి ఒడిగట్టి, 111 సార్లు పొడిచి తన ప్రియురాల్ని చంపిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలి?
ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల గురించి పట్టించుకోవడం మానేశారు కానీ.. ఆ రెండు దేశాల మధ్య ఇప్పటికీ భీకర పోరు కొనసాగుతోంది...
అమెరికా, రష్యా.. కొన్ని దశాబ్దాల నుంచి వీటి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం కొనసాగుతోంది. అన్నింటిలోనూ తమదే పైచేయి ఉండాలని, తామే ఆధిపత్యం చెలాయించాలన్న కాంక్షే.. ఈ రెండు దేశాల మధ్య చిచ్చు రగిల్చింది.