America Ukraine: ఓ సీక్రెట్ ఫోన్ కాల్... అమెరికా అధ్యక్షుడిని ఊహించని ముప్పులోకి నెట్టింది.. ఈ కథ విన్నారా?
ABN , Publish Date - Mar 01 , 2025 | 06:51 PM
Trump Zelenskyy Secret Phone Call : ఉక్రెయిన్ పేరెత్తితేనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ రేంజ్‌లో విరుచుకుపడతాడు. జెలెన్‌స్కీ చేతకానితనం, తెలివితక్కువతనం వల్లే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైందని ఇటీవల బహిరంగంగానే విమర్శించాడు. కీవ్ అధ్యక్షుడిపై ఇంతలా విరుచుకుపడే ట్రంప్.. ఒకప్పుడు ఆయన సాయం కోరాడని మీకు తెలుసా.. ఈ సీక్రెట్ ఫోన్ కాల్..

Trump Zelenskyy Secret Phone Call : 2019లో జరిగిన ఓ ఫోన్ కాల్.. అమెరికా రాజకీయాల్లో పెను తుపానుగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మధ్య జరిగిన ఆ రహస్య సంభాషణ, నాటకీయ మలుపులు తిరిగి ట్రంప్‌ను అభిశంసన వరకు తీసుకెళ్లింది. ఈ కథ 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలతో మొదలైంది. హిల్లరీ క్లింటన్‌పై రష్యా హ్యాకర్లు దాడి చేసి డెమోక్రటిక్ పార్టీని అస్థిరపరిచారని ఆరోపణలు వచ్చాయి. అయితే ట్రంప్ మాత్రం ఒక వింత సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు.. ఇది రష్యా పని కాదు ఉక్రెయిన్ కుట్ర అని చెప్పారు. ఓ రహస్య సర్వర్ ఉక్రెయిన్‌లో ఉందని.. అది హస్తగతం చేసుకుంటే నిజం వెలుగులోకి వస్తుందని ట్రంప్ అంటున్నారు.
జో బైడెన్ కుమారుడిపై అవినీతి ఆరోపణలు..
జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్.. ఉక్రెయిన్‌లోని బురిస్మా అనే సంస్థ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. అయితే, అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌లో అవినీతి నివారించాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఒక వివాదాస్పద ప్రాసిక్యూటర్‌ను తొలగించారు. ఇదే అంశాన్ని పట్టుకుని ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థి జో బైడెన్‌కు వ్యతిరేకంగా అస్త్రంగా మలచుకోవాలని చూశారు.
జెలెన్‌స్కీ సాయం కోరిన ట్రంప్..
ఇదే సందర్భంలో 2019లో జెలెన్‌స్కీతో జరిగిన ఆ ఫోన్ కాల్ ఓ చీకటి మలుపు తిరిగింది. "మా దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది... ఉక్రెయిన్‌కు దీని గురించి చాలా విషయాలు తెలుసు. మీరు ఈ సహాయం చేయాలి" అని ట్రంప్ అడిగారు. సహాయం అంటే సాధారణమైనదేమీ కాదు. "హంటర్ బైడెన్ అవినీతి గురించి విచారణ జరిపి.. దాన్ని బహిరంగంగా ప్రకటించాలి. అంతే కాదు, ఆ రహస్య సర్వర్‌ను కూడా వెతికి పట్టుకోవాలి" అని ట్రంప్ స్పష్టంగా చెప్పేశారు.
రహస్య సంభాషణ బట్టబయలు..
జెలెన్‌స్కీకి కాల్ చేసి ట్రంప్ చేసుకున్న చీకటి ఒప్పందాన్ని అమెరికా భద్రతా విభాగాలు పసిగట్టి.. రహస్య నిఘా అధికారికి ఈ సంభాషణ తెలియడంతో.. అది అమెరికా రాజకీయాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. కాంగ్రెస్‌లో ఆ ఫోన్ కాల్ అంశం చర్చనీయాంశమైంది. ఆఖరికి, ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని అమెరికా ప్రతినిధుల సభ అతనిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది.
అయితే, ట్రంప్ ఈ కేసు నుంచి బయటపడ్డారు. 2020లో సెనెట్ ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. అప్పటి నుంచే ఆయన ఉక్రెయిన్‌పై ద్వేషం పెంచుకున్నాడు. ఆ కోపంతోనే ఇప్పటికీ ఉక్రెయిన్‌పై, జెలెన్‌స్కీపై వ్యక్తిగతమైన విమర్శలు చేస్తున్నాడని అంటారు.
Read Also : Trump vs Zelensky: ట్రంప్, జెలెన్‌స్కీ ఫైట్.. రష్యా షాకింగ్ రియాక్షన్..
Business Idea: తక్కువ పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం.. డిమాండ్ తగ్గని బిజినెస్..
Trump-Zelensky Clash: నీ ఆట ముగిసింది.. జెలెన్‌స్కీకి ట్రంప్ మాస్ వార్నింగ్