Trump vs Zelensky: ట్రంప్, జెలెన్‌స్కీ ఫైట్.. రష్యా షాకింగ్ రియాక్షన్..
ABN , Publish Date - Mar 01 , 2025 | 12:15 PM
అగ్రరాజ్యానికి అధినేత అయిన ట్రంప్‌కు, రష్యాతో యుద్ధాన్ని ఎదుర్కొంటున్న జెలెన్‌స్కీ మధ్య తాజాగా చోటుచేసుకున్న వివాదం.. ప్రపంచం మొత్తాన్నీ నివ్వెరపోయేలా చేసింది. తాజాగా, వీరి మధ్య జరిగిన వివాదంపై రష్యా స్పందించింది..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య వైట్‌హౌస్‌లో మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై జెలెన్‌స్కీపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండానే జెలెన్‌స్కీ బయటికి వెళ్లిపోయారు. అయితే వీరి మధ్య జరిగిన వివాదంపై రష్యా స్పందించింది. ట్రంప్ సంయమనం పాటించారంటూ కొనియాడారు.
అగ్రరాజ్యానికి అధినేత అయిన ట్రంప్‌కు, రష్యాతో యుద్ధాన్ని ఎదుర్కొంటున్న జెలెన్‌స్కీ (Trump Zelensky controversy) మధ్య తాజాగా చోటుచేసుకున్న వివాదం.. ప్రపంచం మొత్తాన్నీ నివ్వెరపోయేలా చేసింది. తాజాగా, వీరి మధ్య జరిగిన వివాదంపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా స్పందించారు. దురుసుగా ప్రవర్తిన జెలెన్‌స్కీపై ట్రంప్ దాడి చేయకుండా సంయమనం పాటించడం అద్భుతమని చెప్పారు. ఇప్పటివరకూ జెలెన్‌స్కీ చెప్పిన అబద్ధాలన్నింటిలోనూ ఇప్పుడు చెప్పింది అతి పెద్ద అబద్ధమన్నారు. జెలెన్‌స్కీ అన్నం పెట్టిన చేతినే నరుతున్నారంటూ మండిపడ్డారు.
రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ (Security Council of Russia) డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ మాట్లాడుతూ అమెరికా పట్ల అమర్యాదగా వ్యవహరించిన ఉక్రెయిన్‌కు ఈ పరిణామాలు చెంపదెబ్బ వంటివని అన్నారు. జెలెన్‌స్కీకి ఇలా జరగాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. రష్యా అంతర్జాతీయ మానవతా సహకార సంస్థ అధిపతి యెవ్జెనీ ప్రిమాకోవ్ మాట్లాడుతూ జెలెన్‌స్కీ హింసను ప్రేరేపిస్తున్నారంటూ మండిపడ్డారు.
అలాగే హంగేరియన్ ప్రధాని (Hungarian Prime Minister) విక్టర్ ఓర్బన్ కూడా ట్రంప్‌కు మద్దతు పలికారు. ‘‘బలవంతులు శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తారు. బలహీనులే యుద్ధం చేస్తారు. ట్రంప్ శాంతి కోసం ధైర్యంగా నిలబడ్డారు’’.. అంటూ విక్టర్ ఓర్బన్ ప్రశించారు. ఇదిలావుండగా ఫ్రాన్స్, కెనడా వంటి దేశాధినేతలు అమెరికా తీరును తప్పపట్టాయి. ఉక్రెయిన్‌కు తామంతా అండగా ఉన్నామని తెలిపారు. తమకు మద్దతుగా నిలిచిన దేశాధినేతలందరికీ జెలెన్‌స్కీ కతజ్ఞతలు తెలియజేశారు.
Trump-Zelenskyy: నీ ఆట ముగిసింది.. జెలెన్‌స్కీకి ట్రంప్ మాస్ వార్నింగ్