Home » Russia-Ukraine war
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ముఖ్యంగా ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనపై చర్చించేందుకు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోవల్ సౌదీ అరేబియా చేరుకున్నారు. జెద్దాలో ఆయనకు సౌదీలో భారత రాయబారి సుహెల్ ఖాన్, కాన్సుల్ జనరల్ మొహమ్మద్ షాహిబ్ అలామ్ స్వాగతం పలికారు.
గతేడాదిలో రష్యా-క్రిమియాని కలిపే కర్చ్ బ్రిడ్జ్‌పై భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో భాగంగా..
శనివారం రష్యాలో అనూహ్య పరిణామాలు అధ్యక్షుడు పుతిన్‌ను కలవరపెట్టాయి. పుతిన్ పెంచి పోషించిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ఊ హించని తిరుగుబాటు చేయడంతో దాదాపు రష్యాలో అంతర్యుద్ధం పరిస్థితులు నెలకొన్నాయి.
కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ (Wagner Group) తిరుగుబాటుతో రష్యాలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. రాజధాని నగరం మాస్కోతోపాటు పలు రష్యన్ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దక్షిణ నగరం రోస్తోవ్-ఆన్-డాన్‌లోని మిలిటరీ హెడ్క్వాటర్స్ను స్వాధీనం చేసుకున్నామని వాగ్నర్ గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.
రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొడతానంటూ తిరుగుబావుటా ఎగురువేసిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ ప్రిగొజిన్.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. తనపై తిరుగుబాటుదారు, దేశద్రోహి అని నిందలు వేసి అధ్యక్షుడు పుతిన్ తీవ్రమైన తప్పు చేశారని హెచ్చరించారు.
ఉక్రెయిన్‌పై యుద్ధకాండను కొనసాగిస్తున్న రష్యాకు కలలో కూడా ఊహించని పరిణామం ఎదురైంది. ఉక్రెయిన్‌పై నిర్విరామ యుద్ధంలో రష్యాకు మద్ధతుగా పోరాడుతున్న కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ (Wagner Group) తిరుగుబావుటా ఎగురవేసింది. రష్యన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అవసరమైన అన్ని అడుగులు వేస్తామని ప్రకటించింది.