Russia wagner: రష్యా కలలో కూడా ఊహించని పరిణామం.. సైన్యంపై తిరుగుబాటు
ABN , First Publish Date - 2023-06-24T14:56:39+05:30 IST
ఉక్రెయిన్‌పై యుద్ధకాండను కొనసాగిస్తున్న రష్యాకు కలలో కూడా ఊహించని పరిణామం ఎదురైంది. ఉక్రెయిన్‌పై నిర్విరామ యుద్ధంలో రష్యాకు మద్ధతుగా పోరాడుతున్న కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ (Wagner Group) తిరుగుబావుటా ఎగురవేసింది. రష్యన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అవసరమైన అన్ని అడుగులు వేస్తామని ప్రకటించింది.
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధకాండను కొనసాగిస్తున్న రష్యాకు కలలో కూడా ఊహించని పరిణామం ఎదురైంది. ఉక్రెయిన్‌పై నిర్విరామ యుద్ధంలో రష్యాకు మద్ధతుగా పోరాడుతున్న కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ (Wagner Group) తిరుగుబావుటా ఎగురవేసింది. రష్యన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అవసరమైన అన్ని అడుగులు వేస్తామని ప్రకటించింది. ఈ మేరకు వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెన్సీ ప్రిగొజిన్ (Yevgeny Prigozhin) నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి లీకయిన ఆడియో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది. ప్రిగొజిన్ ‘సాయుధ తిరుగుబాటుదారుడు’ అంటూ రష్యా అభివర్ణించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాగా వాగ్నర్ గ్రూప్ (అధికారికంగా పీఎంసీ వాగ్నర్) అనేది ఒక ప్రైవేటు మిలిటరీ ఆర్గనైజేషన్.
కాగా వాగ్నర్ గ్రూప్ (అధికారికంగా పీఎంసీ వాగ్నర్) అనేది ఒక ప్రైవేటు మిలిటరీ ఆర్గనైజేషన్. దీనిని యెవ్జెన్సీ ప్రిగొజిన్ నిర్వహిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. ప్రిగొజిన్ ప్రస్తుత వయసు 61 సంవత్సరాలు. గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి చెఫ్ (Cheff) గా పనిచేశారు. తన క్యాటరింగ్ బిజినెస్‌తో ప్రభుత్వ కార్యక్రమాల్లో క్యాటరింగ్ నిర్వహించేవాడు.
వాగ్నర్ గ్రూపును తొలిసారి 2014లో గుర్తించారు. ఆ సమయంలో తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల విభజన బలగాలకు మద్దతుగా ఉంది. అప్పటివరకు ఈ గ్రూప్ సీక్రెట్‌గా ఆపరేషన్లు నిర్వహిస్తూ వచ్చింది. ఎక్కువగా ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండేది. అప్పట్లో రష్యా ఉన్నతవర్గాలు, ప్రత్యేక దళాలకు చెందిన 5000లకుపైగా ఫైటర్లు ఇందులో పనిచేస్తున్నారని ఒక అంచనాగా ఉంది. అయితే ఈ ఏడాది జనవరిలో యూకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్‌లో 50 వేల మంది ఫైటర్లు వాగ్నర్ గ్రూప్ తరపున రష్యాలో పోరాటం చేశారు.