Home » Russia
యావత్ ప్రపంచాన్ని హడలెత్తించిన మాస్కో ఉగ్రదాడిలో (Moscow Terror Attack) తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ‘టెలిగ్రామ్’ (Telegram) అనే మెసేజింగ్ యాప్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. కేవలం డబ్బుల కోసమే తాము ఈ పనికి పాల్పడినట్లు.. ముష్కరుల్లో ఓ వ్యక్తి పేర్కొన్నాడు. తమను ఆ మెసేజింగ్ యాప్ ద్వారా సంప్రదించారని.. తమకు డబ్బులు, ఆయుధాలు సరఫరా చేసిందెవరో తెలియదని అతడు పేర్కొన్నాడు.
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ ఖండించింది. 133 మందిని బలిగొన్న మారణకాండను తీవ్రంగా పరిగణించింది. రష్యా ( Russia ) ప్రజలకు, ప్రభుత్వానికి భారతదేశం బాసటగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 150కి పెరిగింది. ఈ మారణహోమం తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అఫ్ఘానిస్థాన్ శాఖ ప్రకటించింది. అయితే, ఉగ్రవాదులకు ఉక్రెయిన్‌తో సంబంధాలున్నాయని రష్యా అధ్యక్షుడు
రష్యా (Russia) రాజధాని మాస్కోలో (Moscow) భీకర ఉగ్రదాడి (Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లోకి ముష్కరులు దూసుకొచ్చి కాల్పులు జరపడంతో.. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్.. ముఖ్యంగా ISIS-K అని పిలువబడే బ్రాంచ్ ప్రకటించింది.
రష్యా(russia) రాజధాని మాస్కో(moscow)లోని క్రాకాస్ సిటీ కాన్సర్ట్ హాల్లో శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోదీ(narendra Modi) తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా ఈ మేరకు పేర్కొన్నారు.
రష్యా రాజధాని మాస్కో(Moscow)లో దారుణం చోటుచేసుకుంది. క్రోకస్ సిటీలోని కాన్సర్ట్ హాల్(concert hall)పై ఐదుగురు ముష్కరులు వచ్చి ఆకస్మాత్తుగా కాల్పులు(Shooting) జరిపి బాంబులతో దాడి చేశారు. దీంతో 60 మందికిపైగా మృత్యువాత చెందగా, మరో 115 మంది గాయపడ్డారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి(Vladimir Putin) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) బుధవారం ఫోన్ కాల్ చేశారు. అధ్యక్ష పదవికి పుతిన్ తిరిగి ఎన్నికైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తాజా ఫోన్ కాల్ రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin).. ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రష్యా (Russia) పాలనా పగ్గాలను తన చేతుల్లోనే ఉంచుకున్న ఆయన.. 24 ఏళ్లుగా అధికారంలోనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి రష్యా అధ్యక్ష ఎన్నికల్లో (Russia Presidential Election 2024) 87.97% ఓట్లతో గెలుపొంది.. భారీ విజయాన్ని సాధించారు.
రష్యాలో అధ్యక్ష ఎన్నికల కోసం రెండో రోజైన శనివారం ఓటర్లు తమ ఓటు హక్కును జోరుగా వినియోగించుకున్నారు. అయితే ఈ అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ వ్లాదిమిర్ పుతిన్(vladimir Putin) మరో 6 సంవత్సరాల ఎన్నిక అవుతారని పలువురు అంటున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine War) మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి.. మొదట్లో ఈ యుద్ధం రోజుల్లోనే ముగుస్తుందని అంతా భావించారు. కానీ.. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. ప్రారంభ రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా (Russia) ఆధిపత్యం చెలాయించింది. కానీ, ఆ తర్వాత పాశ్చాత్య దేశాల సహకారంతో ఉక్రెయిన్ (Ukraine) కూడా విజృంభించడం మొదలుపెట్టింది.