Share News

Russia-Ukraine War: రష్యాకు దెబ్బ మీద దెబ్బ.. స్పై ప్లేన్‌తో పాటు స్టీల్ ప్లాంట్ ధ్వంసం

ABN , Publish Date - Feb 24 , 2024 | 06:11 PM

రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine War) మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి.. మొదట్లో ఈ యుద్ధం రోజుల్లోనే ముగుస్తుందని అంతా భావించారు. కానీ.. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. ప్రారంభ రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా (Russia) ఆధిపత్యం చెలాయించింది. కానీ, ఆ తర్వాత పాశ్చాత్య దేశాల సహకారంతో ఉక్రెయిన్ (Ukraine) కూడా విజృంభించడం మొదలుపెట్టింది.

Russia-Ukraine War: రష్యాకు దెబ్బ మీద దెబ్బ.. స్పై ప్లేన్‌తో పాటు స్టీల్ ప్లాంట్ ధ్వంసం

రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine War) మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి.. మొదట్లో ఈ యుద్ధం రోజుల్లోనే ముగుస్తుందని అంతా భావించారు. కానీ.. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. ప్రారంభ రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా (Russia) ఆధిపత్యం చెలాయించింది. కానీ, ఆ తర్వాత పాశ్చాత్య దేశాల సహకారంతో ఉక్రెయిన్ (Ukraine) కూడా విజృంభించడం మొదలుపెట్టింది. ఇలా పరస్సర దాడులకు దిగుతుండటంతో.. ఈ యుద్ధం రెండేళ్లైనా ముగియలేదు.


ఈ క్రమంలోనే రష్యాకు ఉక్రెయిన్ తాజాగా ఊహించని ఝలక్‌లు ఇచ్చింది. రష్యాలోని ప్రధాన ఉక్కు కర్మాగారంపై (Russian Steel Factory) డ్రోన్‌లతో దాడి చేయడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్లాంట్ ఉక్రేనియన్ సరిహద్దుకు ఉత్తరాన 400 కి.మీ దూరంలో ఉన్న లిపెట్స్క్ (Lipetsk) నగరంలో ఉందని, ఇది రష్యా ఉక్కు ఉత్పత్తిలో 18% బాధ్యత వహిస్తుందని లిపెట్స్క్ ప్రాంత గవర్నర్ తెలిపారు. రష్యన్ స్టీల్‌మేకర్ నోవోలిపెట్స్క్ (ఎన్‌ఎల్‌ఎంకె) నిర్వహిస్తున్న ఈ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం సంభవించడానికి కారణం డ్రోన్ స్ట్రైక్ అని, ప్రస్తుతం మంటలను అదుపు చేశామని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. కాగా.. ఈ ప్లాంట్‌లోనే రష్యన్ క్షిపణులు, ఆర్టిల్లరీ, డ్రోన్‌లు తయారు చేయబడతాయని.. అందుకే ఉక్రెయిన్ దీనిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేసిందని తెలుస్తోంది. మరోవైపు.. లిపెట్స్క్, కుర్స్క్, తులా ప్రాంతాలపై రాత్రికి రాత్రే ఉక్రేనియన్ డ్రోన్లు కూల్చివేయబడ్డాయని రష్యా అధికారులు తెలిపారు.

అంతకుముందు.. అజోవ్ సముద్రం మీదుగా A-50U రష్యన్ గూఢచారి విమానాన్ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇది దక్షిణ రష్యాపై కూలిపోయినట్లు చూపించే మ్యాప్‌ను కూడా పంచుకుంది. A-50U కూల్చివేతతో రష్యాకు మరో గట్టి దెబ్బ తగిలినట్టయ్యిందని ఉక్రెయిన్ అభిప్రాయపడింది. అయితే.. దీనిపై రష్యా మాత్రం ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు. అయితే.. రష్యా దక్షిణ క్రాస్నోడార్ ప్రాంతంలో విమాన ప్రమాదం జరిగి ప్రదేశంలో అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఉన్నారని మాస్కో పేర్కొంది. సుమారు 250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బంది పేర్కొందని, ఇది స్థానిక గృహాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని క్రాస్నోడార్ ప్రాంతీయ అధికారులు స్పష్టం చేశారు.

Updated Date - Feb 24 , 2024 | 06:11 PM