Home » Secunderabad
Mallareddy: ‘నన్ను శానా ఇబ్బంది పెడ్తున్నరు’ అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి(Ex Minister Mallareddy) భావోద్వేగానికి గురయ్యారు. సికింద్రాబాద్(Secunderabad) పరిధిలోని సుచిత్రలో మల్లారెడ్డికి సంబంధించిన భూమి వివాదంలో(Suchitra Land Issue) ఉన్న ఈ విషయం తెలిసిందే. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే లక్ష్మణ్ పై(MLA Laxma Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు.
రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే ముఠాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయం అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు లక్షలాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు.
హైదరాబాద్(Hyderabad)లో 6 గంటల తర్వాత మళ్లీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఈ క్రమంలో ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వారు వర్షం, ట్రాఫిక్ తీవ్రతను చూసుకుని ప్లాన్ చేసుకొని వెళ్లాలని అధికారులు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్(Parliament Election Schedule) విడుదలైనప్పటి నుంచి పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు.
Telangana: పోలింగ్కు మరికొద్ది గంటల సమయమే ఉంది. దీంతో అధికారులు ఈవీఎంల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు. సికింద్రాబాద్ , హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. రెండు పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ బూత్లకు ఈవీఎంలను పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్లో ఈవీఎంల పంపిణీని జీహేచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ ప్రక్రియ షురూ అయ్యింది. ఓ వైపు సికింద్రాబాద్ నుంచి 44వ జాతీయ రహదారి మీదుగా కండ్లకోయ వరకు, మరోవైపు సికింద్రాబాద్ నుంచి శామీర్పేట వైపు వచ్చే ఈ ఎలివేటెడ్ కారిడార్లకు రక్షణ శాఖ భూములే కీలకంగా మారాయి.
రాష్ట్రంలో పదేళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే.. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి(BJP state president Kishan Reddy) పేర్కొన్నారు.
ఎన్నికలు.. ఓటర్లు.. అనగానే పురుషులు ఎంతమంది!? మహిళలు ఎంతమంది అని చూస్తారు కానీ.. మొత్తం ఓటర్లలో యువత సగానికి సగం ఉన్నారని తెలుసా!?
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ(BJP)కి మద్దతు ఇవ్వాలని టీటీడీపీ(TTDP) నిర్ణయించింది. ఇందులో భాగంగా, టీటీడీపీ నేతలతో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి(Former MLA Chintala Ramachandra Reddy) చర్చలు జరిపారు.
గ్రేటర్ హైదరాబాద్లో కీలకంగా ఉన్న సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ స్థానాలను.. వాటితోపాటు మహబూబ్నగర్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులేస్తోంది.