Home » Shabbir Ali
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియేట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి రేవంత్ రెడ్డి గౌరవం ఇస్తూ విగ్రహాన్ని పెట్టిస్తున్నారని షబ్బీర్ అలీ తెలిపారు.
డ్రగ్స్ సంబంధిత అంశాల్లో తరచూ కేటీఆర్ పేరే ఎందుకు వినిపిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు.
కేటీఆర్ తీరును ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ తప్పు పట్టారు. కేటీఆర్‌కు డ్రగ్స్‌తో సంబంధం ఉన్నట్టు ఉంది. అందుకే డ్రగ్స్ అంశం రాగానే కేటీఆర్ పేరు వస్తోంది. డ్రగ్స్ విషయంలో మా పేర్లు ఎందుకు రావడం లేదు. కేటీఆర్ పేరే ఎందుకు వస్తోంది. కేటీఆర్ ఇప్పటికైనా నార్కో టెస్ట్‌కి వస్తే నిజం తెలుతుంది కదా అని షబ్బీర్ అలీ అన్నారు.
రైతు భరోసా విషయంలో పంట భూముల విషయంలో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
కొన్ని యూట్యూబ్ చానళ్లకు కేటీఆర్ పైసలు వెదజల్లి హైడ్రా, మూసీ ప్రక్షాళనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు.
బ్రేక్ డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోండడంటూ తెలంగాణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు బుద్ధి చెప్పాల్సిందే అంటూ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్(Suresh Kumar Shetkar) ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) వైఫల్యాలపై అధ్యయనానికి ఏఐసీసీ అధిష్టానం కురియన్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో రెండు రోజులుగా పలువురు కాంగ్రెస్ నేతలను పిలిచి వివరాలను తీసుకుంటుంది.
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే నవ్వు వస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియతో మాట్లాడుతూ.. భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
పదేళ్లలో బీజేపీ దేశానికి ఏం చేసిందో చెప్పాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీద ఎందుకు చర్చించటం లేదని నిలదీశారు.మతపరమైన రిజర్వేషన్లను తీసివేస్తానని మోదీ ఎలా చెబుతారని ప్రశ్నించారు.
లోక్‌సభ ఎలక్షన్ల తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ (KTR) జైలుకు పోవడం ఖాయమని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. శనివారం నాడు కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.