Share News

Minister Jupalli : రైతు భరోసాపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 20 , 2024 | 09:34 PM

రైతు భరోసా విషయంలో పంట భూముల విషయంలో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.

Minister Jupalli :  రైతు భరోసాపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

కామారెడ్డి : రైతు భరోసా విషయంలో పంట భూముల్లో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కామారెడ్డిలో ఇవాళ(ఆదివారం) కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో గ్రంథాలయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.


రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే ఈ రోజు తాము ఏపని చేయాల్సి వచ్చేది కాదని అన్నారు. రాష్ట్రంలో మరో 4 లక్షల మందికి దీపావళి తర్వాత రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.


త్వరలోనే కొత్త రేషన్ కార్డులు: షబ్బీర్ అలీ

పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ప్రభుత్య సలహా దారులు షబ్బీర్ అలీ మాటిచ్చారు. దోమకొండకు 100 పడకల ఆసుపత్రి మంజూరైందని చెప్పారు. ఇక్కడ అభివృద్ధి చేస్తామంటే బీజేపీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని విమర్శించారు. కామారెడ్డిలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగింది, కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్య సలహా దారులు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్ హాజరయ్యారు.


ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... రైతులు అందరికీ రైతు భరోసా వస్తుందని హామీ ఇచ్చారు. నిజమైన రైతులకు అందరికీ డబ్బులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. మూసీనది పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ ఉండి పేదల సమస్యలను చూడాలని.. వారి బాధలు తెలుస్తాయని తెలిపారు. నియోజకవర్గానికి 3500 చొప్పున మొదటి విడుతలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ఇస్తామని షబ్బీర్ అలీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Tummala: రైతుబంధు పేరుతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోచిపెట్టారు... మంత్రి తుమ్మల ధ్వజం

ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..

Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..

HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

For Telangana News And Telugu News...

Updated Date - Oct 20 , 2024 | 09:52 PM