Home » Shashi Tharoor
ఎంపీ శశిథరూర్‌కు, కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోంది. కాంగ్రెస్ శశిథరూర్ పేరు ప్రతిపాదించకపోయినా..
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం కొలంబియా పర్యటన హాట్ హాట్‌గా సాగింది. ఆ దేశ గడ్డపైనే కొలంబియా స్పందించిన తీరును శశిథరూర్ తూర్పారపట్టారు.
Shashi Tharoor on Operation Sindoor: అఖిలపక్ష ప్రతినిధి బృందంతో పాటు గయానా చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాకిస్థాన్ పై తీవ్ర విమర్శలు చేశారు. 'ఆపరేషన్ సిందూర్' పాక్ ఉగ్రవాదులు సృష్టించిన హింసకు ప్రతిస్పందన అని.. యుద్ధం కాదని అన్నారు. ఇంకోసారి భారత్ జోలికొస్తే రియాక్షన్ మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత దేశ చర్యలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు తనను ఎంపిక చేయడంపై ఎంపీ శశి థరూర్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
విక్రమ్ మిస్రీపై సోషల్ మీడియా దాడులను ఖండిస్తూ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఒక తీర్మానం చేయాలని అంతా భావించినట్టు శశిథరూర్ చెప్పారు. అయితే మిస్రీ అందుకు నిరాకరించారని తెలిపారు.
1971 యుద్ధంలో ఇందిరాగాంధీ తీసుకున్న చర్యలతో 2025 నాటి పరిస్థితిని పోల్చలేమని శశిథరూర్ అన్నారు. పాక్‌తో యుద్ధాన్ని పొడిగించడం భారత్ టాప్ ప్రియారిటీగా లేదన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కేరళలోని విజిన్జం అంతర్జాతీయ సీపోర్ట్ ప్రారంభించారు. ఈ క్రమంలో మోదీ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారని, ఇది కొంత మందికి నిద్ర లేకుండా చేస్తుందన్నారు.
శశిథరూర్ ఇటీవల సొంత పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యలు చేసిన పలు సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని ఇటీవల ప్రశంసించారు.
ప్రపంచానికి శాంతి అనేది చాలా కీలకమని, యుద్ధరంగంలో శాంతి సాధ్యం కాదని నరేంద్ర మోదీ అనేవారని, చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే శాశ్వత శాంతిని తీసుకువచ్చే స్థితిలో ప్రస్తుతం మన దేశం ఉందని శశిథరూర్ అన్నారు.
శశిథరూర్ ఇటీవల ఒక ఆర్టికల్‌లో కేరళ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ప్రధానమంత్రి అమెరికా పర్యటనపై సైతం ప్రశంసలు కురిపించారు. వీటిపై కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోందనే ప్రచారం జరుగుతోంది.