Shashi Tharoor: కాంగ్రెస్‌తో విభేదాలపై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:19 PM
శశిథరూర్ ఇటీవల ఒక ఆర్టికల్‌లో కేరళ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ప్రధానమంత్రి అమెరికా పర్యటనపై సైతం ప్రశంసలు కురిపించారు. వీటిపై కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోందనే ప్రచారం జరుగుతోంది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ (Congress)లో మరోసారి విభేదాలు తలెత్తాయా? పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor)కు, అధిష్టానానికి మధ్య విభేధాలు నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై శశిథరూర్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.18వ శతాబ్దం నాటి ఆంగ్ల కవి థామస్ గ్రే కవితలోని పదాలను ఆయన షేర్ చేశారు. ''అజ్ఞానం ఆనందంగా ఉన్న చోట తెలివిగా ఉండటం మూర్ఖత్వం'' అనే అర్థం వచ్చేలా ఈ కవిత సాగింది.
Atishi: ఆప్ విపక్ష నేతగా అతిషి.. ఈ పదవికి తొలి మహిళగా రికార్డు
కాంగ్రెస్, థరూర్ మధ్య విభేదాలు ఏమిటి?
శశిథరూర్ ఇటీవల ఒక ఆర్టికల్‌లో కేరళ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ప్రధానమంత్రి అమెరికా పర్యటనపై సైతం ప్రశంసలు కురిపించారు. వీటిపై కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై థరూర్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, తాను 16 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రభుత్వంలో తమ పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఇతర పార్టీ ప్రభుత్వం ఉన్నా మంచి పనులు చేస్తే ప్రశంసించడం, తప్పు చేస్తే నిలదీయడం తన నైజమని చెప్పారు. కేరళలోని ప్రస్తుత లెఫ్ట్ హయాంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వృద్ధి గురించి ఒక ఆర్టికల్‌లో చెప్పానే కానీ ప్రభుత్వం గురించి కాదని వివరించారు. ప్రభుత్వం చేయాల్సిందే చాలానే ఉందని అన్నారు. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్డ్ 2024 ఆధారంగా వాస్తవ నిజాలు, లెక్కలను తన ఆర్టికల్‌లో ప్రస్తావించానని తెలిపారు. ఆర్టికల్ మొత్తం చదవి మాట్లాడాలే కానీ ఏదో ఒక లైను ఆధారంగా చేసుకుని కామెంట్ చేయడం సరికాదని ఆయన అన్నారు. అందులో పార్టీ రాజకీయాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, ఆర్థిక దివాళా నుంచి రాష్ట్రం బయటపడాల్సిన అవసరాన్ని తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో పదేపదే చెబుతూ వస్తున్నానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర ఏమిటనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో శశిథరూర్ అసంతృప్తితో ఉన్నారనే వార్తలు కొద్దికాలంగా వినిపిస్తు్న్నాయి. పార్లమెంటులో కీలక డిబేట్‌లలో పాల్గొనే అవకాశం ఇవ్వడం లేదని, సమస్యను పరిష్కరించడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారని ఆయన అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు.
రాహుల్‌ను కలిసిన శశిథరూర్
కాగా, శశిథరూర్ రాసిన ఆర్టికల్‌పై కేరళ కాంగ్రెస్ యూనిట్ విమర్శలు గుప్పించిందన్న వార్తల నేపథ్యంలో రాహుల్ గాంధీని గత మంగళవారంనాడు శశిథరూర్ కలుసుకున్నారు. రాహుల్‌తో చక్కటి సంభాషణ జరిగిందని సమావేశానంతరం శశిథరూర్ తెలిపారు. సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయనే వివరాలను ఆయన దాటవేశారు. పార్టీ తనను పక్కకు పెట్టడంతో అసంతృప్తిగా ఉన్నారా అని అడిగినప్పుడు.. తాను ఎప్పుడూ ఎవరైనా ఫిర్యాదు చేయలేదని ఆయన క్లుప్తంగా సమాధానమిచ్చారు.
ఇవి కూడా చదవండి...
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.