Home » Shikhar Dhawan
ఎవరి జీవితంలోనైనా పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. వివాహ బంధం అనేది కలకాలం నిలిచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని భావిస్తారు. కానీ కొన్ని బంధాలకు మధ్యలోనే బీటలు వారతాయి. పెళ్లైన కొన్నేళ్లకే విడిపోతుంటారు. ఇందుకు క్రికెటర్లు కూడా మినహాయింపేమీ కాదు.
వివాహబంధం నుంచి బయటికొచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్ మరోసారి ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో ఓ విదేశీ మహిళతో శిఖర్ ధావన్ కనిపించడంతో వీడియో వైరలవుతోంది.
సాధారణంగా.. ఒక మ్యాచ్‌కి కెప్టెన్ దూరమైనప్పుడు, అతని స్థానంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న ఆటగాడు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అయితే.. ఏప్రిల్ 13వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ దూరమైనప్పుడు, సామ్ కరన్ ఆ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు.
గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఒకట్రెండు మ్యాచ్‌లకు ధవన్ అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ భంగార్ పేర్కొన్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ ధావన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు 177 పరుగుల మోస్తారు లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ శిఖర్ ధావన్(45) మినహా మిగతా బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోయినప్పటికీ విలువైన పరుగులు చేశారు. దీంతో పంజాబ్ జట్టు మంచి స్కోర్ సాధించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో మ్యాచ్‌లో అతిథ్య పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటగా బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ 17లో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్(punjab kings), ఢిల్లీ క్యాపిటల్స్(delhi capitals) జట్ల మధ్య ఛండీగఢ్(chandigarh) ముల్లన్పూర్(Mullanpur)లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ రెండు జట్లలో ఏ మ్యాచ్ గెలుస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ కొన్నాళ్లుగా కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాడు. తన భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపోవడంతో తన కుమారుడు జొరావర్‌ను ధావన్ కలుసుకోలేకపోతున్నాడు. అయితే ఇటీవల తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో అది వైరల్ అవుతోంది.
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ అధిపత్యం కొనసాగుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా.. పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. వన్ సైడేడ్‌గా సాగిన ఈ పోరులో ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.