Share News

Shikhar Dhawan: కొత్త గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పేసిన ధవన్.. ఆమెనే ప్రేయసి అంటూ..

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:57 AM

Shikhar Dhawan Girlfriend: టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ తన రిలేషన్‌షిప్ గురించి ఓ హింట్ ఇచ్చాడు. ఆమెనే తన కొత్త ప్రేయసి అని బయటపెట్టాడు. మరి.. ధవన్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

Shikhar Dhawan: కొత్త గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పేసిన ధవన్.. ఆమెనే ప్రేయసి అంటూ..
Shikhar Dhawan

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ క్రికెట్‌కు దూరమై చాన్నాళ్లు అవుతోంది. అయితే ఇతర విషయాల వల్ల అతడు వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 సమయంలో ధవన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాడు. విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న ఈ సీనియర్ ప్లేయర్.. చాంపియన్స్ ట్రోఫీలో ఓ అందమైన అమ్మాయితో కలసి కనిపించాడు. దీంతో ఆమె అతడి కొత్త గర్ల్‌ఫ్రెండ్ అంటూ రూమర్స్ వినిపించాయి. అయితే ఆ తర్వాత వాళ్లు మళ్లీ జంటగా కనిపించకపోవడంతో వాటికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే తాజాగా దీనిపై ధవన్ హింట్ ఇవ్వడంతో మళ్లీ రూమర్స్ జోరందుకున్నాయి. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..


నా గర్ల్‌ఫ్రెండ్ తనే..

చాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల సమయంలో ధవన్ పక్కన ఓ మిస్టరీ గర్ల్‌ కనిపించింది. ఆమె పేరు సోఫీ షైన్ అని, తనది ఐర్లాండ్ అని వినిపించింది. ధవన్‌తో ఆ అమ్మాయి డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపించాయి. అయితే దీనిపై అటు ఆ మిస్టరీ గర్ల్ గానీ ఇటు ధవన్ గానీ రియాక్ట్ కాకపోవడం, మళ్లీ ఎక్కడా జంటగా కనిపించకపోవడంతో దీన్ని అంతా మర్చిపోయారు. అయితే తాజాగా తన న్యూ రిలేషన్‌షిప్‌పై ధవన్ ఓపెన్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అతడు మాట్లాడుతూ.. తాను ఎవరి పేరు తీసుకోబోనని, అయితే ఈ గదిలోని అత్యంత అందమైన అమ్మాయే తన గర్ల్‌ఫ్రెండ్ అని చెప్పాడు.


సేమ్ టు సేమ్

ధవన్ మాటలతో అలర్ట్ అయిన కెమెరామెన్.. ఆ రూమ్‌లోని ఓ అమ్మాయిపై ఫోకస్ చేయగా.. చాంపియన్స్ ట్రోఫీలో హల్‌చల్ చేసిన సోఫీలాగే ఉండటంతో ధవన్ తన లవ్ కన్ఫర్మ్ చేశాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ధవన్ ఎక్కడికి వెళ్లినా నయా గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొనే వెళ్తున్నాడని.. దీనిపై రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పెడదామనే ఉద్దేశంతోనే ఈ రూమ్‌లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అంటూ హింట్ ఇచ్చాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మరి.. వీళ్ల ప్రేమ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.


ఇవీ చదవండి:

స్టార్ యాక్టర్‌పై కోహ్లీ ఫ్యాన్స్ సీరియస్

రబాడపై పగబట్టిన బీసీసీఐ

సంజూకి లైన్‌ క్లియర్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2025 | 12:01 PM