Share News

Ashutosh Sharma Mentor: అశుతోష్ వెనుక అదృశ్య శక్తి.. టీమిండియా స్టార్ సాయంతో..

ABN , Publish Date - Mar 25 , 2025 | 11:22 AM

LSG vs DC IPL 2025: సింగిల్ హ్యాండ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంచలన విజయం అందించాడు అశుతోష్ శర్మ. ఫోర్లు, సిక్సులతో విశాఖ తీరంలో సునామీ సృష్టించిన ఈ పించ్ హిట్టర్.. తన థండర్ నాక్ వెనుక సీక్రెట్‌ను బయటపెట్టాడు.

Ashutosh Sharma Mentor: అశుతోష్ వెనుక అదృశ్య శక్తి.. టీమిండియా స్టార్ సాయంతో..
Delhi Capitals

ఏ ఆటగాడు సక్సెస్ అవ్వాలన్నా వాళ్ల కుటుంబ సభ్యుల అండ కావాలి. ఆటలోని మెళకువలు నేర్పిస్తూ తీర్చిదిద్దే కోచ్‌లూ ఉండాలి. అలాగే పెద్ద దిక్కులా వెంట నిలబడి సపోర్ట్ చేసే మెంటార్ కూడా ఉండాలి. అలాంటి ఓ మెంటార్ వల్లే తాను ఈ రేంజ్‌లో ఆడుతున్నానని రివీల్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసక బ్యాటర్ అశుతోష్ శర్మ. ఒక టీమిండియా స్టార్ సాయంతోనే తన బ్యాటింగ్ మెరుగుపడిందని.. అతడు తనకు సపోర్ట్‌గా ఉంటూ నడిపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. మరి.. అశుతోష్ వెనుక ఉన్న ఆ సూపర్ పవర్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం..


అతడే నా మెంటార్

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ తన గురువు అని రివీల్ చేశాడు అశుతోష్ శర్మ. మెంటార్‌గా ఉంటూ తనను అతడు ఎంతో ఎంకరేజ్ చేశాడని తెలిపాడు. అందుకే నిన్నటి మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అతడికి అంకితం చేస్తున్నట్లు వెల్లడించాడు. గత ఐపీఎల్‌లో చేసిన పలు తప్పిదాలను ఇప్పుడు సరిచేసుకున్నానని పేర్కొన్నాడు. మ్యాచులు ఫినిష్ చేయడంలో మిస్టేక్స్ చేశానని.. వాటిపై ఫోకస్ చేసి మెరుగుపడ్డాడనని వ్యాఖ్యానించాడు.


నమ్మకమే గెలిచింది

గత ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు అశుతోష్. అప్పుడు ఆ జట్టుకు సారథిగా ఉన్న శిఖర్ ధవన్ ఈ కుర్ర బ్యాటర్‌కు అండగా నిలబడ్డాడు. కీలక సమయాల్లో అతడిపై నమ్మకం ఉంచి బ్యాటింగ్‌కు దింపాడు. అందుకే అతడు తన మెంటార్ అని.. అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అంకితం చేస్తున్నట్లు అశుతోష్ రివీల్ చేశాడు. అలాగే మ్యాచ్ తర్వాత ధవన్‌కు వీడియో కాల్ చేసి కాసేపు ముచ్చటించాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 66 పరుగులు చేశాడతను. లక్నో చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను పవర్ హిట్టింగ్‌తో లాగేసుకున్నాడు.


ఇవీ చదవండి:

పంత్ వర్సెస్ లక్నో ఓనర్.. ఏం జరిగిందంటే..

టీమిండియాలోకి అశుతోష్ శర్మ

తండ్రైన కేఎల్ రాహుల్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2025 | 12:16 PM