Home » Siddipet
ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్‌పై సెస్ విధిస్తే ఇక్కడి రైతుల ఆయిల్ పామ్‌కు ధర పెరిగి లాభం చేకూరు తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) తెలిపారు.
Telangana: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం మొదలైంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్త సంచలనాన్ని రేపుతోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ.. బీఆర్ఎస్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుస్నాబాద్ - కరీంనగర్ రోడ్ లో అతి వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది.
సిద్దిపేట: స్వచ్ సర్వేక్షన్లో దక్షణ భారత దేశంలోనే సిద్దిపేటకు క్లిన్ సిటీ అవార్డ్ రావడానికి కృషి చేయడంతో పాటు సంక్రాంతి పండగ కూడా కావడంతో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు మున్సిపల్ కార్మికులను సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్త బట్టలతో సన్మానించారు.
తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ( Harish Rao ) సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు పై కైట్ ఫెస్టివల్నీ శనివారం నాడు ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లా: భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్నస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరుగనున్నది. సిద్దిపేట జిల్లా, కొమురవెల్లి తోటబావి వద్ద కన్నుల పండువగా మల్లన్న కళ్యాణ వేడుక జరగనుంది.
Telangana: కొమురవెళ్లి మల్లికార్జున స్వామివారి మూలవిరట్ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ ఈవో బాలాజీ శర్మ తెలిపారు. ఉత్సవ విగ్రహాలతో భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు.
Telangana: జిల్లాలోని చేర్యాల పట్టణంలో కల్తీపాల కలకలం రేగింది. చేర్యాలలోని ప్రభుత్వ అనుబంధ సంస్థ విజయ డెయిరిలో పాలను కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. పాలల్లో వెన్నశాతం ఎక్కువ రావడానికి ఉప్పు, చక్కెర వేసి కల్తీ చేసి అమ్ముతున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Telangana: జిల్లాలోని హుస్నాబాద్‌లో ప్రజా పాలనపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. 28 నుంచి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రతీ కుటుంబానికి అందేలా దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు.