Share News

Raghunandanrao: హరీష్‌రావు ప్రోద్బలం లేకుండానే ఆ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారా?

ABN , Publish Date - Jan 24 , 2024 | 02:10 PM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్త సంచలనాన్ని రేపుతోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ.. బీఆర్‌ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Raghunandanrao: హరీష్‌రావు ప్రోద్బలం లేకుండానే ఆ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారా?

సిద్దిపేట, జనవరి 24: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) కలవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్త సంచలనాన్ని రేపుతోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (BJP Leader Raghunandan Rao) స్పందిస్తూ.. బీఆర్‌ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఖర్మ సిద్ధాంతం ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు అనుభవంలోకి వస్తోందని.. ఎవరు చేసుకున్నది వారికే తిరిగి వస్తుందనడానికి ఆ నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలవడమే నిదర్శనమన్నారు.

భూమి గుండ్రంగా ఉంటదని.. మనమేం చేస్తే అదే తిరిగి వస్తుందంటే ఇదే అని చెప్పుకొచ్చారు. మెజారిటీ ఉన్నా కూడా అప్పుడు బీఆర్‌ఎస్ చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందన్నారు. పార్టీలను చీల్చడానికి, ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బీఆర్‌ఎస్‌కు ఏడేండ్లు పడితే... కాంగ్రెస్‌కు ఏడు నెలలు కూడా పట్టడం లేదన్నారు. హరిశ్‌రావు ప్రోద్బలం లేకుండా వీరు వెళ్తారా అని బీజేపీ నేత ప్రశ్నించారు.


ఆ వార్తతోనే మెదక్ నేతలు అలర్ట్...

బీఆర్‌ఎస్‌లో బావ బామ్మర్ధులకు పడటం లేదన్నారు. కవిత మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వార్తలు రావడంతో జిల్లా నేతలు, ఎమ్మేల్యేలు అలెర్ట్ అవుతున్నారన్నారు. హరీష్‌రావు ప్రోద్బలం లేకుండా వారంతా సీఎంను కలిసే అవకాశం లేదన్నారు. ప్రజలు తిరస్కరించిన తరువాత కూడా బీఆర్‌ఎస్ నేతల్లో మార్పు రావడం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్ పెద్ద జీరో అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ అంటే ఏమిటో తమకు నిన్నటి వరకు గుర్తు లేదా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ దుష్ట సంప్రదాయం తెచ్చింది బీఆర్‌ఎస్ అని విరుచుకుపడ్డారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అది మూసీ, బంగాళాఖాతంలో వేసినట్లే అని అన్నారు.

బీఆర్‌ఎస్‌లో మళ్లీ అదే కొట్లాట...

2009 లో కేసీఆర్ అధ్యక్ష పీఠం గుంజుకోవడానికి జరిగిన కొట్లాట మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతోందన్నారు. బీఆర్‌ఎస్ అధ్యాయం మొన్నటి ఎన్నికలతో ముగిసిందన్నారు. అధికారం కోల్పోయినా ఇంకా తాము అధికార పార్టీ అన్నట్లుగా వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటనడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అయితే ఇక ఎన్నికల అవసరం ఉంటుందా అని ప్రశ్నించారు. బీజేపీకి ఈసారి రాష్ట్రంలో 16 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు 12 సీట్లు అనడం భ్రమ అని.. 90 సీట్లతో అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి సింగిల్ డిజిట్ వచ్చిందన్నారు. ఇప్పుడు ఆ పార్టీని గల్లీలో కాంగ్రెస్ రానియదని.. ఢిల్లీలో బీజేపీ రానియదని రఘునందన్ రావు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 24 , 2024 | 04:05 PM