Home » Siddipet
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో - ట్రాలీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా... 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతిచెందిన మహిళలు జయమ్మ, శిరీషగా గుర్తించారు.
Telangana Elections: మంత్రి హరీష్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్లోనీ మాడల్ పోలింగ్ బూత్ నెం114లో మంత్రి హరీష్‌రావు సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు( CM KCR ) సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలో తన ఓటు హక్కును గురువారం నాడు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ దంపతులు హెలికాప్టర్లో రేపు చింతమడకకు రానున్నారు.
Telangana Elections: దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఆ భూమి ఇవ్వకపోగా ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కున్నారని బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్, ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ పాల్గొన్నారు.
నేను రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ సిద్దిపేట అభ్యర్థి దూది శ్రీకాంత్‌రెడ్డి ( Doodi Srikanth Reddy ) మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) కి సవాల్ విసిరారు.
Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక పట్టణంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రోడ్ షోలో పాల్గొన్నారు.
మోటర్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే అదనపు డబ్బులు రాలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కుండ బద్దలు కొట్టారని, ఇంత కాలం బీజేపీ నాయకులు (BJP Leaders) అబద్దాలతో దబాయించారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్‌లో బీఆర్ఎస్ యువజన గర్జనలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
Telangana Elections: కాలం అయినా కాకున్నా నేడు కాళేశ్వరం జలాలతో శనిగరం ప్రాజెక్టు ద్వారా రెండు పంటలకు నీళ్ళు వస్తున్నాయని మంత్రి హరీష్‌రావు అన్నారు.
Telangana Elections: గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని మల్లన సాగర్ భూ నిర్వాసితుల ఆర్అండ్ఆర్ కాలనీలో ఈటెల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.