Harish Rao: కాంగ్రెస్‌ను నమ్మితే కైలాసంలో పెద్ద పాము మింగినట్టు డమాల్ మంటం..
ABN , First Publish Date - 2023-11-21T14:51:47+05:30 IST
Telangana Elections: కాలం అయినా కాకున్నా నేడు కాళేశ్వరం జలాలతో శనిగరం ప్రాజెక్టు ద్వారా రెండు పంటలకు నీళ్ళు వస్తున్నాయని మంత్రి హరీష్‌రావు అన్నారు.
సిద్దిపేట: కాలం అయినా కాకున్నా నేడు కాళేశ్వరం జలాలతో శనిగరం ప్రాజెక్టు ద్వారా రెండు పంటలకు నీళ్ళు వస్తున్నాయని మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) అన్నారు. మంగళవారం కోహెడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు (BRS Candidate MLA Satish Kumar) మద్దతుగా ఎన్నికల ప్రచారం రోడ్ షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. మల్ల ఎలక్షన్లు రాగానే కాంగ్రెసోల్లు బయల్దేరారని.. కరోనా వచ్చినప్పుడు ప్రజలతో ఉన్నది తామే అని.. కాంగ్రెస్ నేతలు అప్పుడు ఎటు పోయారని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ 5 గ్యారంటీలు అన్నారని.. ఇప్పుడు అక్కడ ప్రజలు అగైయిపోయినం అంటున్నారన్నారు. గతంలో దొంగోలే వచ్చే కరెంట్‌తో నేను ఎట్లా సాగు చేస్తురో అని రైతులు పాటలు పడుకున్నారన్నారు. మూడు గంటల కరెంటు ఇస్తే 3 ఎకరాలు పరుతుందట, రేవంత్ రెడ్డికి హార్స్ పవర్ అంటే అర్థం తెలువదు అతను పీసీసీ అధ్యక్ష పదవి మీద కూర్చున్నారని మంత్రి విమర్శించారు.
‘‘కాంగ్రెస్‌ను నమ్మితే కైలాసంలో పెద్ద పాము మింగినట్టు డమల్ మంటం. కాంగ్రెసోల్ల 6 గ్యారంటీలు దేవుడెరుగు కానీ 6 నెలల కొసరి సీఎం కుర్చీ కోసం కొట్లడుడు అయితే గ్యారంటీ. గతి, సుతి లేని కాంగ్రెస్‌ను నమ్మితే అగం అవుతాం, దేశంలో రైతుకు డబ్బులు ఇచ్చింది ఒకే ఒక్కడు కేసీఆర్. టీఆర్ఎస్ పథకాలతో పాటు రమక్క పాటను కూడా కాంగ్రెసోల్లు నకలు కొట్టిండు’’ అంటూ విరుచుకుపడ్డారు. రైతుబంధు పథకం దుబారా అంటూ విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు రైతుబంధు రూ.15 వేలు ఇస్తామంటున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఎకరాలు ఉన్న అవే రూ.15 వేలు ఇస్తారని.. కానీ బీఆర్ఎస్ ఎన్ని ఎకరాలు ఉంటే ఎకరాకు రూ.16 వేల చొప్పున డబ్బులు ఇస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే బీఆర్ఎస్ మేనిఫెస్టో 100% బాగుందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు 100 అబద్దాలు ఆడి కుర్చీలో కూర్చోవాలని చూస్తున్నారన్నారు. గ్యారంటీలు అని కర్ణాటకకు వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇప్పుడు అగమవుతున్న కర్ణాటకలో పత్తాలేరన్నారు. భారతదేశంలో నాణ్యమైన కరెంట్ విరామం లేకుండా ఇస్తున్న కేసీఆర్‌ను విరామం లేకుండా గెలిపించాలని కోరారు. హుస్నాబాద్‌ను మూడు ముక్కలు చేశామంటున్నారు కానీ హుస్నాబాద్ మూడు దిక్కుల అభివృద్ధి అవుతుందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.