Home » Singanamala
ఎన్ని రోజులు తిరిగినా స్థానిక స్థానిక తహసీల్దార్ కార్యాల యంలో జనన మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇక్కడి అధికారులు ఎప్పుడు వస్తారో..? ఎప్పుడు వెళతారో..? అర్థం కావడం లేదని మండి పడుతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ఒక సీనియర్ అసిస్టెంట్ మాత్రం వచ్చారు.
నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏడుగురు స్కూల్ గేమ్స్ ఫెడరేషన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో ఆర్భాటంగా కాలనీలు కాదు... ఊ ర్లు నిర్మిస్తున్నామంటూ గొప్పలు చెప్పి జగనన్న కాలనీ లు ఏర్పాటు చేశారు. అయితే ఆ కాలనీల్లో పూర్తి స్థా యిలో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ఆయా కాలనీల్లో మౌలిక కల్పించకపోవడంతో నివాసముంటున్న లబ్ధి దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలో గార్లదిన్నె, కల్లూరు, ఇల్లూరు, మర్తాడు, యర్రగుంట్ల తదితర గ్రామాల్లో జగనన్న కాలనీలు ఏ ర్పాటు చేశారు.
నేను అవినీ తికి పాల్పడను... ఎవ్వ రికి భయపడను ... ’అంటూ కోపంతో సర్వ సభ్య సమావేశం నుంచి తహసీ ల్దారు అరుణకుమారి వెళ్లి పోయారు. స్థానిక మండలపరిషత కార్యాల యంలో గురువారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశం వాడివేడిగా జరిగింది.
తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన నియోజకవర్గాన్ని పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాలోనే టాప్‌లో నిలపడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పిలుపునిచ్చారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమ వారం ఆమె పార్టీ బూత, క్లస్టర్, యానిట్, ఇనచార్జిలు, కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై అవగహన సదస్సు నిర్వహించారు.
శింగనమల చెరువు మరవ వద్ద ప్రమాణి కులకు ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సీఎం చంద్రబాబు నాయుడును కో రారు. ఆమె ఆదివారం మంగ ళగిరిలోని టీడీపీ కార్యాల యంలో సీఎం చంద్రబాబును కలసి, నియోజకవర్గంలో చేప ట్టవలసిన అభివృద్ధి పనులపై విన్నవించారు.
సాగు, తాగు నీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, వాటి ఆధునీకరణ చేపట్టాలని సీపీఎం సీనియర్ నాయకులు ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ విమర్శిం చారు. తుంగభద్ర ప్రాజెక్టులో నీరు పొంగిపోర్లుతున్న సుబ్బరాయసాగర్ నింపలేని దౌర్భాగ్యస్థితిలో పాలకులు, అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో సాగు, తాగునీటి సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం మండలపరిధిలోని నడిందొడ్డి, కేసేపల్లి మీదుగా మం డల కేంద్రమైన నార్పలకు చేరింది.
జాతీయ రహదారి పనుల్లో భాగంగా శింగనమల మరవకొమ్మ వద్ద బ్రిడ్జి నిర్మించాలని శింగనమల రహదారి పోరాట సమితి సభ్యులు, ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం జాతీయ రహదారికి అడ్డంగా కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మరవకొమ్మ వద్ద బ్రిడ్జి నిర్మించాలని పలు మార్లు అధికారులకు ప్రయోజనం లేకపోయిందన్నారు. గంటపాటు ధర్నా చేపట్టారు.
జాతిపిత మహాత్మ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజాన్ని నేడు కూటమి ప్రభుత్వం నెరవేర్చ బోతోం దని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొ న్నారు. పల్లెపండుగ వారోత్సవాల కార్యక్రమాన్ని బుధవారం మండల పరిధిలోని ముంటిమడుగు, కొత్తూరు గ్రామాల్లో చేపట్టారు.
వైద్యఆరోగ్యశాఖలో ఓ చిరుద్యోగి ఆర్ఎంపీ డాక్టర్‌గా అవతారమెత్తి క్లినిక్ నడపడంపై వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఈబీ దేవి ఈబీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తనిఖీ చేసి క్లినిక్‌ను సీజ్ చేయించారు.