THIRST : మూగజీవాలకు తీరని దాహం
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:52 PM
అసలే వేసవికాలం. గత ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో మండలంలోని కుంటలు, చెరువుల్లో నీరు లేదు. మూగజీవాల దాహం తీర్చే నీటి తొట్టెలు కనబడడంలేదు. దీంతో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు గొర్రెల కాపర్లు, రైతుల తిప్పలు వర్ణనా తీతం. వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.

- గతంలో నిర్మించిన నీటితొట్టెలు ధ్వంసం
- వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్న కాపరులు, రైతులు
- త్వరగా కొత్తవి నిర్మించాలని వేడుకోలు
శింగనమల, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : అసలే వేసవికాలం. గత ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో మండలంలోని కుంటలు, చెరువుల్లో నీరు లేదు. మూగజీవాల దాహం తీర్చే నీటి తొట్టెలు కనబడడంలేదు. దీంతో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు గొర్రెల కాపర్లు, రైతుల తిప్పలు వర్ణనా తీతం. వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. గతంలో పశువులు, గొర్రెలు, మేకలు తదితర మూగజీవాల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన నీటి తొట్టెలు కాలగర్బంలో కలిసిపోయాయి. దీంతో మూగజీవాలు నీళ్లు దొరక్క దప్పికతో తల్లడిల్లుతున్నాయి.
కనిపించని నీటి తొట్టెలు
ఉపాధిహామీ పథకం కింద 2018-19లో మండలవ్యాప్తంగా గ్రామానికి ఒక్క నీటి తొట్టెను దాదాపు రూ. 25 వేలు చొప్పున వె చ్చించి నిర్మించారు. ఇంటి గ్రేటేడ్ వాటర్‌షెడ్ మేనేజ్ మెంట్ ప్రోగాం (ఐడబ్ల్యూ ఎంపీ) ద్వారా ఉపాధి హామీ పథకం కింద గ్రామ ప్రంచాయతీ నిధులతో మండల వ్యాప్తంగా 19 పంచాయ తీల్లో 50 పశువుల తొట్టెలు నిర్మించారు. వీటి నిర్వ హణను పశుసంవర్థన శాఖ కు అప్పగించారు. అయితే గత వైసీపీ పాలనలో అవి పూర్తిగా ధ్వంసం కావ డం తో కాలగర్భంలో కలిసి పోయాయి.
గత ఐదేళ్లలో ధ్వంసం
గత వైసీపీ ఐదేళ్ల పాలన లో నీటితొట్టెల గురించి పట్టించుకోలేదు. కొందరు తొట్టెలను పగులగొట్టి అ స్థలాలను అక్రమంచుకున్నారు. ఇంకొన్ని కట్టిన చోట్ల వాటి ఆనవాళ్లే కనిపించకూండాపోయాయి. ఉన్న కొన్ని తొట్టెలు బీటలు బారి ఎరువుల దిబ్బలుగా దర్శినమిస్తున్నాయి. దీంతో కిలో మీటర్ల దూరం తీసువెళ్లి మూగ జీవాలకు నీరు తాపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాపర్లు, రైతులు వాపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా ఉన్న తొట్టెలను వినియోగంలోకి తీసుకురావాలని, మిగిలిన గ్రామాల్లో నూతనంగా నిర్మించాలని కాపర్లు, రైతులు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం - పద్మనాభయ్య, ఏడీ, పశుపంవర్ధక శాఖ
శింగనమల మండలంలో మూగజీవాల దప్పిక తీర్చడానికి ఉపాధి హామీ పథకం కింద తొట్టెల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. గతంలో నిర్మించిన తొట్టెల మర్మమ్మతులతో పాటు అవసరమైన గ్రామాల్లో కొత్తవి నిర్మిస్తాం.