FESTIVAL: ఉత్సాహంగా ఉట్ల పరుష
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:00 AM
మండల కేంద్రంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఉట్లపరుష ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద మంగళవారం ఉట్ల పరుష కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగింది.

బుక్కరాయసముద్రం, ఏప్రిల్1(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఉట్లపరుష ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద మంగళవారం ఉట్ల పరుష కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఉట్లమాను ఎక్కడానికి చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా పోటీ పడ్డారు. అంతకు మునుపు ఉట్ల మానును గ్రామంలో ఊరేగిస్తూ వసంత్సోవం నిర్వహించారు. సాయంత్రం కొండమీద వెంకటరమణ స్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉట్లమాను పరుష వద్దకు తీసు కొచ్చారు. ఈ పోటీని తిలకించడానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉట్లమాను విజేతగా నిలచిన మురళి అనే యుకుడికి గ్రామస్థులు ఆధ్వర్యంలో బహుమతి అందజేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....