Home » Skill Development Case
స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై (Chandrababu arrest) స్పందించాల్సిన అవసరంలేదనంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడారు. క్రిమినల్‌ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. ఇంకా దర్యాప్తు పూర్తవ్వకుండా, కనీసం కోర్టుల్లో కూడా ఎటూ తేలకముందే బాధ్యతాయుత స్పీకర్ పదవిలో ఉండి క్రిమినల్‌ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనను నిర్భంధించిన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో గాంధీ జయంతి రోజున నిరసన దీక్ష చేయనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది. ‘‘మోత మోగిద్దాం’’ అంటూ బ్రహ్మణి ఇచ్చిన పిలుపుతో ఉదయం నుంచే విశాఖ వాసులు సంపూర్ణ మద్దతు తెలిపారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై (Chandra Babu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు, ప్రముఖులు స్పందిస్తున్నారు...
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ ఉద్యోగులు మద్దతుగా నిలిచారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని.. వెంటనే ఆయనను విడుదల చేయాలంటూ హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు, ఆందోళనలు కూడా చేపట్టారు.
చంద్రబాబు నాయుడుకి మద్దతుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, సతీమణి బ్రహ్మణి పిలుపునిచ్చిన ‘‘మోత మోగిద్దాం’’ కార్యక్రమానికి ఎంపీ రఘురామ సంఘీభావం తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా, రాజ్యాంగాన్ని నమ్మేవారు అందరూ చంద్రబాబుకు మద్దతు తెలపాలని కోరారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు. అరెస్ట్ అక్రమమని పార్టీలకు అతీతంగా నేతలు చెబుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు రవిబాబు కూడా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఊరట దక్కింది. ఏపీ హైకోర్ట్ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అమరావతి ఇన్నిర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో ముందస్తు బెయిల్‌పై విచారణ ముగిసిన నేపథ్యంలో ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోసం నారా లోకేశ్ పిటిషన్ వేశారు. ఈ మేరకు ఆయప తరపున న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును (Chandrababu) మరింత ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ (Jagan Govt) ప్రయత్నాలు చేస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో (Skill Development Case)...