Home » software
అత్యధిక వేతనాలు అందించే స్థానంలో టాప్‌లో ఉండేది సాఫ్ట్ వేర్ రంగమే. అయితే ఈ రంగంలో పని చేసే వారికి ఉండే ఒత్తిడి మరే రంగంలోనూ ఉండదంటే అతిశయోక్తి కాదు. వారాంతపు టార్గెట్ల పేరుతో ఉద్యోగులను వెంటాడుతుంటాయి ఐటీ సంస్థల యాజమాన్యాలు. తాజాగా ఈ రంగంలో పని చేస్తున్న మహిళలపై స్కిల్ సాఫ్ట్ ఓ సర్వే నిర్వహించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వచ్చిన తర్వాత సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. క్లిష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా కొత్త యాప్స్ (Apps), టూల్స్ (Tools) పుట్టుకొస్తున్నాయి. కొన్ని సంస్థలైతే హ్యూమనాయిడ్ రోబోట్లను (Humanoid Robots) కూడా సిద్ధం చేశాయి. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు చెందిన కాగ్నిషన్ (Cognition) అనే స్టార్టప్ సరికొత్త సంచలనానికి పునాది వేసింది.
హైదరాబాద్: పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిపై గుర్తు తెలియని యువకులు దాడి చేశారు. అనురాగ్ విశ్వవిద్యాలయం సమీపంలో కారులో వెళ్తున్న టీసీఎస్ ఉద్యోగి కుర్వ నవీన్ కుమార్‌పై యూనివర్సిటీ వద్ద 8 మంది యువకులు అకారణంగా దాడి చేశారు.
Telangana: ఆ యువతికి మరో 12 రోజుల్లో పెళ్లి. ఇరు కుటుంబాలకు చెందిన వారు పెళ్లికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతలోనే యువతి తీసుకున్న నిర్ణయం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోయే యువతి.. తన ప్రాణాన్ని వదిలేసింది. నగరంలోని గచ్చిబౌలి కొత్తగూడలోని హాస్టల్లో విద్యాశ్రీ(23) అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ ఉద్యోగుల(software Engineers) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు సంస్థలో పనిచేస్తున్న అందరు 5 లక్షల మంది ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.
గూగుల్ మ్యాప్స్(Google Maps) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైనా ప్రాంతానికి వెళ్లాలంటే అనేక మంది దీనిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం అనేక చోట్ల వాహనదారులు ఆయా ప్రాంతాల లైవ్ లొకేషన్ సెట్ చేసుకుని ప్రయాణాలు చేస్తుంటారు. ప్రస్తుతం దీనిని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్ దిగ్గజం గూగుల్ దీనిలో వినియోగదారుల కోసం ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు నగర ఓటర్లకు పలు సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ‘ఓటు వేయండి.. ఆఫర్ పట్టండి..’ అంటూ