Share News

TG News: హిదాయత్ ఆలీ మర్డర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

ABN , Publish Date - Jul 01 , 2024 | 04:20 PM

భాగ్యనగరంలోని గోల్కొండ‌ చోటాబ‌జార్ ప్రాంతానికి చెందిన ఇదాయత్ ఆలీ‌ని (Idayat Ali) దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదాయత్ ఆలీ దుబాయ్‌లో ఇంజ‌నీర్‌గా పనిచేస్తున్నాడు.

TG News: హిదాయత్ ఆలీ మర్డర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

హైదరాబాద్: భాగ్యనగరంలోని గోల్కొండ‌ చోటాబ‌జార్ ప్రాంతానికి చెందిన ఇదాయత్ ఆలీ‌ని (Idayat Ali) దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదాయత్ ఆలీ దుబాయ్‌లో ఇంజ‌నీర్‌గా పనిచేస్తున్నాడు. ఆలీతో ఎవవరెవరికి పరిచయాలు ఉన్నాయి. అతని ఫోన్‌ లిస్ట్‌లో ఉన్న వారిపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో ఆలీ హత్యకు సంబంధించిన విషయాలను గుర్తించారు. అయితే ఈ మర్డర్ కేసులో ట్విస్ట్ నెలకొంది. అక్రమ సంబంధం కారణంగానే ఇదాయత్ ఆలీని హత్య చేసినట్లు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీస్ అధికారులు దర్యాప్తులో కనిపెట్టారు.

ఆలీని మర్డర్ చేసింది ఓ మహిళ, ఆమె బాయ్ ఫ్రెండ్‌తో పాటు మరో మహిళగా పోలీసులు నిర్ధారించారు. మొత్తంగా ముగ్గురు కలిసి ఇంజనీర్ ఇదాయత్ ఆలీని హత్య చేసినట్టు పోలీసులు విచారణలో తేల్చారు. ఆమె బాయ్ ఫ్రెండ్‌ వీడియో గ్రాఫర్‌ పనిచేస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిదాయత్‌ను వీడియోగ్రాఫర్ దారుణంగా హతమార్చడని పోలీసులు చెప్పారు. ఈరోజు (సోమవారం) సైబరాబాద్ ఎస్ఓటీ పోలీస్ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ హత్య కేసుకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు.


కారులో వెళ్లిన తర్వాత జరిగింది ఇదే.. ?

‘‘ఇదాయత్ ఆలీ‌ని హత్య చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేశాం. గోల్కొండ ప్రాంతానికి చెందిన సీమా, ఆరీఫ్‌లను అరెస్టు చేశాం. సిమాతో ఇంజనీర్ హిదాయత్ ఆలీకి అక్రమ సంబంధం ఉంది. హిదాయత్ ఆలీతో పాటు ఆరిఫ్‌తో కూడా లేడి కిలాడి సీమా ఇల్లీగల్ అఫైర్ నడిపిస్తునట్లు విచారణలో తేలింది. ఇంజనీర్ హిదాయత్ సీమా మధ్య గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. హిదాయత్ దుబాయ్ వెళ్లిన తర్వాత ఓ ఫంక్షన్‌లో ఆరిఫ్‌తో సీమాకు పరిచయం ఏర్పడింది. వీడియోగ్రాఫర్ ఆరిఫ్‌తో ఆమె అక్రమ సంబంధం కొనసాగించింది. ఇద్దరితో మహిళ అక్రమ సంబంధం కొనసాగించింది. గత15 రోజుల క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఇంజనీర్ హిదాయత్ వచ్చాడు. తిరిగి దుబాయ్ వళ్తున్న క్రమంలో సీమాను ‌ కలవాలని కారు తీసుకొని ఆమెతో మంచిరేవులకు హిదాయత్‌ తీసుకెళ్లాడు. కారులోనే సిమాతో కలిసి ఉన్న దృశ్యాలను ఆరిఫ్ వీడియో రికార్డ్ చేశాడు. మీ వ్యవహారం అంతా రికార్డ్ చేశానంటూ హిదాయత్‌తో బెదిరింపులకు దిగాడు. అతనికి డబ్బులు ఇస్తానని హిదాయత్ బతిమిలాడాడు. లోపలకు వెళ్లి మాట్లాడుదామని హిదాయత్‌ను ఓ నిర్మానుష్య ప్రాంతానికి ఆరిఫ్ తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మాటా మాట పేరగడంతో కత్తి తీసి హిదాయత్‌ కడుపులో ఆరిఫ్ పొడిచాడు. అంతటితో ఆగకుండా ఇదాయత్ అలీని విచక్షణారహితంగా పొడిచి గొంతు కోసి దారుణంగా ఆరిఫ్ హత్య చేశాడు’’ అని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీస్ అధికారులు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి....

KTR : పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలి

AP Pensions: ఏపీలో ఆగిన పెన్షన్ల పంపిణీ..

KCR: తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 01 , 2024 | 05:16 PM